తప్పులు చేయం : 300 ఏళ్లు సంతోషంగా ఉండాలి

  • Published By: madhu ,Published On : January 20, 2020 / 07:37 AM IST
తప్పులు చేయం : 300 ఏళ్లు సంతోషంగా ఉండాలి

గత ప్రభుత్వ మాదిరిగా తాము తప్పులు చేయమని, గత 100 సంవత్సరాల నుంచి వచ్చిన తప్పులను తాము సరిదిద్దుతున్నామని ఏపీ మంత్రి బుగ్గన వెల్లడించారు. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధి, CRDA బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. ముందుగా వికేంద్రీకరణ బిల్లుపై మంత్రి బుగ్గన చర్చ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా గత పాలకులు చేసిన తప్పులను సభ సాక్షిగా ప్రకటించారు. తమ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని అనుకోవడం లేదన్నారు. వంద సంవత్సరాల నుంచి జరిగిన తప్పులను సరిద్దుతామని, 200-300 సంవత్సరాలు వచ్చినా..అందరూ సమానత్వంతో సంతోషంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గత పాలకులు కావాల్సిన పని అంతా చేసుకున్నారు..టెంపరరీ బిల్డింగ్‌లు, రోడ్లు వేశారని విమర్శించారు. 
 

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటే ఎందుకంత భయం

ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటే ఎందుకంత భయమని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రశ్నించారు. వైజాగ్‌లో మావోయిస్టులు, నక్సలైట్లు ఉన్నారని ప్రచారం చేస్తున్నారని సభకు తెలిపారు. హైకోర్టు దగ్గరకు వెళితే..క్యాంటిన్‌లో టీ, భోజనం సరిగ్గా దొరకని పరిస్థితి నెలకొందన్నారు. మొత్తంగా తమ ప్రభుత్వం ప్రజా నామస్మరణ చేసుకుంటూ ముందుకెళుతుందని, అందరూ సంతోషంగా బిల్లును ఆమోదింప చేయాలని మంత్రి బుగ్గన సూచించారు. 

Read More : రాజధాని @ విశాఖ : అనుకున్నది చేసిన సీఎం జగన్