జనవరి 30నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • Published By: chvmurthy ,Published On : January 11, 2019 / 11:42 AM IST
జనవరి 30నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆఖరి సమావేశాలు  జనవరి 30 నుంచి జరగునున్నాయి. ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉన్నందున  ఫిబ్రవరి5న బడ్జెట్ ప్రవేశ పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ఆరు పనిదినాలు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఈఆఖరి సమావేశాల్లో  గడిచిన  నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమకార్యక్రమాలను సభలో చెప్పాలని ప్రభుత్వం యోచిస్తోంది. పేదకుంటుబాలకు పెంచిన ఫించన్ ను ఫిబ్రవరి నుంచి అందచేయటానికి, రైతురుణ మాఫీకి సంబంధించి రెండు దఫాలు రైతులకు చెల్లించాల్సిన 9 వేల కోట్ల రూపాయల నిధుల కోసం ప్రభుత్వం వేటలోఉంది. ఫిబ్రవరి మొదటి నుంచి 2వేల రూపాయలు పేదలకు అందించేందుకు ప్రభుత్వం  కృతనిశ్చయంతో ఉంది. వచ్చేఎన్నికల్లో టీడీపీ  ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లేందుకు టీడీపీ వ్యూహకమిటీ  ప్రణాళికలు రూపొందిస్తోంది.