త్రీ కేపిటల్స్, పరిపాలన రాజధాని విశాఖ : అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన

రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 05:56 AM IST
త్రీ కేపిటల్స్, పరిపాలన రాజధాని విశాఖ : అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన

రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన

మూడు రాజధానులపై ముందడుగు పడింది. జగన్ ప్రభుత్వం తాను అనుకున్నట్టు చేసింది. మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. వికేంద్రీకరణ బిల్లుని.. సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 
ముందుగా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ చేపట్టారు.

దీనిపై మంత్రి బుగ్గన మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వికేంద్రీకరణ బిల్లులో ప్రభుత్వం పేర్కొంది. చట్ట సభల రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని చెప్పారు.

మంత్రి బుగ్గన కామెంట్స్:
* మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ముందడుగు
* సభ ముందకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి, వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు
* పరిపాలన వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ
* వికేంద్రీకరణ బిల్లు చరిత్రాత్మకం
* సమ్మిలిత అభివృద్ధి మనందరి బాధ్యత
* జోన్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు డెవలప్ మెంట్ బోర్డులు ఏర్పాటు

* అభివృద్ది నత్తనడకన కాకుండా వేగంగా పరిగెత్తేలా చూసే బాధ్యత కూడా బోర్డులదే
* చట్ట సభలకు(లెజిస్లేటివ్ కేపిటల్) రాజధాని అమరావతి
* పరిపాలన రాజధానిగా(ఎగ్జిక్యూటివ్ కేపిటల్) విశాఖ
* కార్యనిర్వాహక వ్యవస్థ అంతా విశాఖలోనే ఉంటుంది
* న్యాయ రాజధానిగా(జ్యుడీషియల్ కేపిటల్) కర్నూలు అర్బన్ డెవలప్ మెంట్ ఏరియా
* మూడు రాజధానుల ప్రతిపాదనను వికేంద్రీకరణ బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం
* విశాఖలోనే రాజ్ భవన్, సచివాలయం, హెచ్ ఓడీ ఆఫీసులు

* హైకోర్టుకు సంబంధించిన విభాగాలన్నీ కర్నూలులోనే
* స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం
* పెద్ద నగరాల అభివృద్ధి వలస పాలనలోనే జరిగింది.. ఈ మధ్య కాలంలో జరగలేదు
* రాజభవనాలు కావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదు
* తమ అవసరాలు తీర్చే పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
* పన్నుల ఆదాయాన్ని బట్టే పరిపాలన ఉంటుంది
* అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్
* 3,4 జిల్లాలకు కలిపి ఓ జోనల్ డెవలప్ మెంట్ బోర్డు