Europe Expo 2022: పర్యాటక రంగంలో రూ.550 కోట్ల పెట్టుబడులు రాబట్టిన ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 11 ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఛైర్మన్ ఎ.వరప్రసాద్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను వినోద హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఆ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయని అన్నారు. లండన్ లో సెప్టెంబరు 12 నుంచి 15 వరకు జరిగిన యూరప్ ఎక్స్‌పో 2022లో పాల్గొని ఈ పెట్టబడులను ఏపీకి తీసుకువచ్చినట్లు వివరించారు.

Europe Expo 2022: పర్యాటక రంగంలో రూ.550 కోట్ల పెట్టుబడులు రాబట్టిన ఆంధ్రప్రదేశ్

Europe Expo 2022

Europe Expo 2022: ఆంధ్రప్రదేశ్ లో రూ.550 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు 11 ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీటీడీసీ) ఛైర్మన్ ఎ.వరప్రసాద్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను వినోద హబ్ గా మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో ఆ సంస్థలు భాగస్వామ్యం కానున్నాయని అన్నారు. లండన్ లో సెప్టెంబరు 12 నుంచి 15 వరకు జరిగిన యూరప్ ఎక్స్‌పో 2022లో పాల్గొని ఈ పెట్టబడులను ఏపీకి తీసుకువచ్చినట్లు వివరించారు.

రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాజెక్టుల్లో ఆ 11 సంస్థలు పెట్టుబడులు పెడతాయని చెప్పారు. స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ వరల్డ్ వైడ్ సంస్థ విశాఖ పట్నంలో స్కై టవర్ ప్రాజెక్టును చేపట్టడానికి రూ.100 కోట్ల పెట్టనుందని తెలిపారు. టర్కీకి చెందిన పాలిన్ గ్రూప్ విశాఖ పట్నంలో టన్నెల్ ఆక్వేరియం ప్రాజెక్టులో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకుంటోందని చెప్పారు. జర్మనీకి చెందిన హుస్ పార్క్ అట్రాక్షన్స్ సంస్థ వినోద పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చిందని తెలిపారు.

కెనడాకు చెందిన ఏరోడియం సంస్థ గండికోటలో స్కై-డైవింగ్ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కానుందని చెప్పారు. ఇటలీకి చెందిన నెవెప్లాస్ట్ వింటర్ స్పోర్ట్స్ కు సంబంధించిన పరికరాలను అందించనుందని తెలిపారు. ఎక్స్‌ట్రీమెవెంచర్స్ ఆఫ్ ఫ్రాన్స్ అడ్వెంచర్ పార్క్ ల ఏర్పాటుకు ముందుకు వచ్చిందని చెప్పారు. టర్కీకి చెందిన డీఓఎఫ్‌ ఫ్లయింగ్ థియేటర్లు, హై-ఎండ్ మీడియా-ఆధారిత సిమ్యులేటర్ల డోమ్ థియేటర్లను నిర్మించడానికి అంగీకరించిందని అన్నారు.

కెనడాకు చెందిన వైట్ వాటర్ వెస్ట్ ఆంధ్రప్రదేశ్ లో వాటర్ పార్క్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుందని చెప్పారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ‘అట్రాక్షన్’ కంపెనీ కైలాసగిరి కొండలపై మ్యూజియం, ఇతర ప్రాజెక్టులపై ఆసక్తి చూపిందని అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన కాన్సెప్ట్ 1900 కూడా టూరిజం ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కానుందని చెప్పారు. అలాగే, న్యూజిలాండ్‌కు చెందిన డెల్టా స్ట్రైక్ సంస్థ ఏపీ పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులపై ఆసక్తి చూపిందని తెలిపారు.

 

Hyderabad T20 Match: శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లు.. భారీగా తరలివెళ్లిన ఫ్యాన్స్