Somu Veerraju On Chiranjeevi Tweet : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్..? చిరంజీవి ట్వీట్‌పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీతో చిరంజీవి కలిసి పని చేయాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి పని చేస్తాను అంటే ఎవరినైనా స్వాగతించాల్సిందే అన్నారు సోమువీర్రాజు.

Somu Veerraju On Chiranjeevi Tweet : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్..? చిరంజీవి ట్వీట్‌పై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

Somu Veerraju On Chiranjeevi Tweet : రాజకీయాలపై ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన 10 సెకన్ల ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అని ఆ ఆడియోలో చిరంజీవి చెప్పారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు, రాజకీయ నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మనకు రాజకీయాలు వద్దు బాస్ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని మరికొందరు కోరుతున్నారు. అసలు.. ఆ డైలాగ్ కు రాజకీయాలకు సంబంధమే లేదని.. చిరంజీవి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ లోని డైలాగ్ మాత్రమే అనే వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో అసలు విషయం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి ట్వీట్ ను కొందరు సినిమా ప్రమోషన్ యాంగిల్ లో చూస్తున్నారు, మరికొందరు పొలిటికల్ యాంగిల్ లో చూస్తున్నారు. మొత్తంగా.. మెగాస్టార్ పొలిటికల్ రీఎంట్రీపై జోరుగా చర్చ నడుస్తోంది.

Megastar Chiranjeevi : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్? రాజకీయం నా నుంచి దూరం కాలేదన్న చిరంజీవి ట్వీట్‌పై జనసేన నేతల స్పందన

రాజకీయం నా నుంచి దూరం కాలేదు..అంటూ..చిరంజీవి చేసిన ట్వీట్ పై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబపాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న బీజేపీతో చిరంజీవి కలిసి పని చేయాలని సోమువీర్రాజు పిలుపునిచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి పని చేస్తాను అంటే ఎవరినైనా స్వాగతించాల్సిందే అన్నారు సోమువీర్రాజు. రాజకీయాల్లోకి రావాలనే చిరంజీవి ఆలోచన మంచిదే అన్నారు. చిరంజీవి ఆశయం సిద్ధించాలని ఆకాంక్షించారు. ఏపీలో కుటుంబ రాజకీయాలు బహిష్కరించే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తోందని, ఆ దృష్ట్యా చిరంజీవి కూడా రాజకీయాలు నడిపితే ఇంకా బాగుంటుందని సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు.

ఇక, రాష్ట్రంలో పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్ స్టార్ట్ చేశామన్నారు సోమువీర్రాజు. ఏపీలో అవినీతి, కుటుంబపాలనను గద్దె దింపేందుకు కార్యాచరణ రూపొందించామని చెప్పారు. రాష్ట్రం అప్పులు చేస్తుంటే కేంద్రం ఆదుకుంటోందన్నారు.

Chiranjeevi : రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు.. చిరు ట్వీట్.. దేనిని ఉద్దేశించి??

”వైసీపీ వాళ్లకు 9 నవరత్నాలు ఉంటే.. బీజేపీకి 3 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారు. వాళ్లకున్నది అవినీతి. లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, శాండల్ మాఫియా, ల్యాండ్ మాఫియా, అన్నీ మాఫియాలే. మేము మోదీ నాయకత్వంలో నిజాయితీ అయిన పరిపాలన. క్లీన్ చిట్ ఉన్న పరిపాలన. ఏపీలో ఇస్తాం. మేము అభివృద్ధి రాజకీయాలతో ముందుకెళ్తున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీనే అభివృద్ధి చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అప్పులపాలు చేస్తోంది.

ఉద్యోగాలు ఇస్తామని అన్నారు కానీ ఇవ్వలేదు. పీఆర్సీ ఇస్తామన్నారు. అదీ ఇవ్వలేదు. వైసీపీ ప్రభుత్వం చేస్తానన్నది ఏదీ చెయ్యలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి అనేకం చేస్తోంది. పోలవరానికి కేంద్రం నిధులు ఇస్తోంది. నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. హైడ్రో పవర్ జెనరేషన్ ఏమైంది అని వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మేము నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి హైడ్రో పవర్ జనరేషన్ ఎందుకు కట్టడం లేదు. కేంద్రం నుంచి తెచ్చిన అప్పులు ఏమయ్యాయి? కాంట్రాక్టర్ ఎక్కడికి వెళ్లాడు? గ్రామ అభివృద్ధి బీజేపీ లక్ష్యం. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకపోతే ఆందోళనలు చేస్తాం. ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడిస్తాం” అని సోమువీర్రాజు ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.