Somu Veerraju : కేసీఆర్‌‌పై సోమువీర్రాజు హాట్ కామెంట్స్

పెట్రోల్ ధరలు తగ్గాంచాలని ప్రధాని కోరితే కేసిఆర్ కావు కేక ఏంటి ? ఇలాంటి కావు కేకలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ దిగుమతులకు రూ. 20 లక్షలు కోట్లు అవసరం ఉంటుందని...

Somu Veerraju : కేసీఆర్‌‌పై సోమువీర్రాజు హాట్ కామెంట్స్

Ap Bjp

Somu Veerraju : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సీఎం కేసీఆర్ పై ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ పతనం ప్రారంభమైందని.. పెట్రోల్ ధరలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రాలు పెట్రోల్ ధరలు తగ్గించాలని ప్రధాన మంత్రి సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ స్పందించారు. కేంద్రం ధరలు ఎందుకు పెంచుతోందని ప్రశ్నించారు. 2022, ఏప్రిల్ 28వ తేదీ గురువారం రాజమండ్రిలో బీజేపీ గోదావరి జోనల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. పెట్రోల్ ధరలు తగ్గాంచాలని ప్రధాని కోరితే కేసిఆర్ కావు కేక ఏంటి ? ఇలాంటి కావు కేకలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్ దిగుమతులకు రూ. 20 లక్షలు కోట్లు అవసరం ఉంటుందని.. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం రాజకీయ సూన్యత తెలంగాణలో ఉందని, ఉభయ ప్రాంతీయ పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Read More : Somu Veerraju On BJP-TDP Alliance : టీడీపీ-బీజేపీ పొత్తుపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

రూ. 7 వేల 200 కోట్లు ఏపీ రాజధానికి ఖర్చు చేసి చివరకు అదే కనపడక పోవడంతో రైతులు ఉధ్యమం చేయడం జరిగిందన్నారు. ఒక పార్టీ మాట్లాడదు మరో పార్టీ మాట మారుస్తోందని, రాజధానిని వివాదం చేసిన పరిస్థితులు దేశంలో ఎక్కడా లేదు.. గతంలో రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఎక్కడా సమస్యలు లేవన్నారు. కుటుంబ వారసత్వ ఆలోచన ఉన్న పార్టీల వల్లే రాజదాని సమస్య వచ్చినట్లు, పోలవరం ప్రాజెక్టును డబుల్ ఇంజన్ స్పీడ్ తో ముందుకు తీసుకుని వెళ్లాలని ప్రధాని భావిస్తున్నట్లు వెల్లడించారు. అందువల్లే ఇరిగేషన్ మంత్రి గజేంద్ర షెఖావత్ పోలవరం ప్రాజెక్టును సందర్శించిన తరువాత సమీక్షలు పెంచడం జరిగిందని వివరించారు. ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కుటుంబ పార్టీల ప్రభుత్వాలు కారణమన్నారు. ఏపీ సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమం, మొత్తం అప్పలు మయమని, మొత్తంగా రాష్ట్రం అవినీతి మయంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి ఉందని సోము వీర్రాజు హెచ్చరించారు. సోము వీర్రాజు చేసిన కామెంట్స్ పై తెలుగు రాష్ట్రాల్లోని అధికారపక్షం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More : Somuveerraju : 2024లో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం : సోమువీర్రాజు

మరోవైపు… తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయ్యేలా ఆ పార్టీ అగ్ర నాయకత్వం దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే తెలంగాణలో కమలనాథులు అధికార టీఆర్ఎస్ ను ఢీకొంటూ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రతో పాటు నియోజకవర్గాల వారిగా పార్టీ బలోపేతంపై తెలంగాణలోని సీనియర్ బీజేపీ నేతలు ఫోకస్ చేశారు. అయితే ఏపీలో బీజేపీ ఆశించిన స్థాయిలో దూకుడు ప్రదర్శించడం లేదన్న భావన ఆ పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ఏపీలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, బీజేపీ పెద్దలు కార్యాచరణ రూపొందించారు. ఏపీలో సంస్థాగతంగా బలోపేతమే లక్ష్యంగా చేసుకొని 2022, ఏప్రిల్ 27వ తేదీ బుధవారం నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం విశాఖ పట్టణంలో ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం జరిగింది. 28వ తేదీ గురువారం రాజమహేంద్రవరంలో గోదావరి జోన్ సమావేశం నిర్వహించారు. ఇక 29న గుంటూరు కోస్టల్ జోన్ సమావేశం, 30న అనంతపురంలో రాయలసీమ జోన్ సమావేశాలు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరగనున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి కేంద్ర మంత్రి మురళీధరన్, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణతో పాటు రాజ్యసభ సభ్యులు పాల్గోనున్నారు.