Rules Break :పెళ్లికి వచ్చిన బంధువులకు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా

శ్రీకాకుళం జిల్లాలోని భామిని (మం) తాలాడ గ్రామంలో పెళ్ళికి వచ్చిన బంధువులకు పోలీసులు జరిమానా విధించారు.ఒక్కొక్కరూ రూ.1000 కట్టాలని ఆదేశించారు.

Rules Break :పెళ్లికి వచ్చిన బంధువులకు ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా

Marrige Guast Fine

Corona rules break : ఈ కరోనా కాలంలో ఇంట్లో శుభకార్యం జరగాలంటే ప్రభుత్వం ఆదేశించిన రూల్స్ పాటించి తీరాల్సిందే. లేకుండా జరిమానా తప్పదని పోలీసులు హుకుం జారీ చేస్తున్నారు. ఇంట్లో శుభమాంటూ పెళ్లి చేసుకుంటుంటే ఈ పోలీసులు..జరిమానాలు గోల ఏంటి రా బాబూ అని అనుకోవటానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే ఈ కరోనా కాలంలో అటువంటివి పాటించకుంటే తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా ఉంది పరిస్థితి. హా ఏముంది? అలా చెబుతారు గానీ ఏం చేస్తారులే అని లైట్ తీసుకుంటే జేబుల వెయిటే కాదు బ్యాంకు బ్యాలెన్స్ వెయిట్ కూడా తగ్గిపోక తప్పదు. ఎందుకంటే మరి కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు కట్టాలిగా జరిమానా? అలా ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఓ ఇంటిలో జరిగిన పెళ్లిలో కరోనా రూల్స్ బ్రేక్ చేయటంతో చక్కగా వారికి జరిమానా పండింది అదికూడా భారీగా…

శ్రీకాకుళం జిల్లాలోని భామిని (మం) తాలాడ గ్రామంలో ఓ పెళ్లి రిసెప్షన్ వేడుకలో కోవిడ్ నిబంధనలు బేఖాతర్ చేసి రిసెప్షన్ కు బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ విషయం కాస్తా ఇరుగు పొరుగువారు అదేనండీ..స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఇంకేముంది. కరోనా అంటే చాలు ఓయ్ అని పలికే ఈ మహమ్మారిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా హుటాహుటిన పెళ్లి జరిగే ఇంటికి వచ్చేశారు. పోలీసులు వచ్చేసరికి పెళ్లి ఇంటిలో రిసెప్షన్ జరుగుతోంది. వాళ్లు వచ్చేసరికి పెళ్లి ఇంటిలో పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులతో పాటు అదనంగా మరో 30 మంది బంధువులు చక్కగా సందడి సందడిగా కనిపించారు. ఏమాత్రం కరోనా నిబంధనలు పాటించకుండా. అది చూసిన పోలీసులు ఇంకేముంది? సంతోషంగా మీరు పెళ్లి చేసుకుంటున్నారు ఓకే..కానీ కరోనా నిబంధలేవి?అంటూ ఒక్కో మనిషికి కట్టండి రూ.1000 రూపాయలు అంటూ మొత్తం 30మందికి వెయ్యి రూపాయల చొప్పున 30 వేలు ఫైన్ వేసి వాటిని వసూలు చేసుకుని మరీ వెళ్లారు. పోలీసులు అధికారులు.

ఇంకేముంది..కరోనా అంటే చాలు ఓయ్ అని పలికే ఈ మహమ్మారిని దృష్టిలో పెట్టుకున్న పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా హుటాహుటిన పెళ్లి జరిగే ఇంటికి వచ్చేశారు. పోలీసులు వచ్చేసరికి పెళ్లి ఇంటిలో రిసెప్షన్ జరుగుతోంది. వాళ్లు వచ్చేసరికి పెళ్లి ఇంటిలో పెళ్లి కుమార్తె కుటుంబసభ్యులతో పాటు అదనంగా మరో 30 మంది బంధువులు చక్కగా సందడి సందడిగా కనిపించారు. ఏమాత్రం కరోనా నిబంధనలు పాటించకుండా. అది చూసిన పోలీసులు ఇంకేముంది? సంతోషంగా మీరు పెళ్లి చేసుకుంటున్నారు ఓకే..కానీ కరోనా నిబంధలేవి?అంటూ ఒక్కో మనిషికి కట్టండి రూ.1000 రూపాయలు అంటూ మొత్తం 30మందికి వెయ్యి రూపాయల చొప్పున 30 వేలు ఫైన్ వేసి వాటిని వసూలు చేసుకుని మరీ వెళ్లారు. పోలీసులు అధికారులు.