Andhra Pradesh : కృష్ణ పట్నం,గంగవరం పోర్టులను బీజేపీ ఒత్తిడితోనే జగన్ అదానికి కట్టబెట్టారు : రావెల

కృష్ణ పట్నం,గంగవరం పోర్టులను బీజేపీ ఒత్తిడితోనే జగన్ అదానికి కట్టబెట్టారు అంటూ ఏపీ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు విమర్శించారు.

Andhra Pradesh : కృష్ణ పట్నం,గంగవరం పోర్టులను బీజేపీ ఒత్తిడితోనే జగన్ అదానికి కట్టబెట్టారు : రావెల

AP BRS leader Ravela Kishore Babu criticizes BJP

Andhra Pradesh :  బీజేపీ ఒత్తిడితోనే కృష్ణ పట్నం,గంగవరం పోర్టులను జగన్ అదానికి కట్టబెట్టారు అంటూ బీఆర్ఎస్ నేత రావెల కిషోర్ బాబు ఆరోపించారు. ఏపీలో పెనుమార్పులు సంభవించబోతున్నాయని ఇటు వైసీపీని, అటు టీడీపీని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ ఏపీలో విజయం సాధించటం ఖాయం అంటూ రావెల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపి రాజకీయాల్లో పెను మార్పులు జరగబోతున్నాయి
ని..ఈ మార్పులు ఎవరూ ఊహించనవని అన్నారు రావెల. వైసీపీ, టీడీపీ కలిసి ఏపీకి రాజధాని లేకుండా చేశాయని..ప్రపంచంలో ఏపి అంటేనే అసహ్యించుకుకునే పరిస్థితికి దిగజార్చారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం చేతకానితనంతో ఏపీకి పెట్టుబడులే రావటంలేదనీ..అభివృద్ధి అనేమాటలకు అర్థం తెలియని వైసీపీ ప్రభుత్వం ఘనకార్యం వల్ల ఏపీ ప్రగతి 20 ఏళ్ల వెనక్కిపోయిందన్నారు.వైసీపీ ప్రభుత్వం చేసే అవినీతికి అంతులేకుండా పోయిందన్నారు. తెలంగాణలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుందనీ.. సింగపూర్, మలేషియాను తలదన్నేలా హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని..ముఖ్యంగా కేసీఆర్ అంటే కక్షపూరితంగా వ్యవహరిస్తోంది అంటూ విమర్శించారు.

కవితపై తప్పుడు కేసులు పెట్టి విచారణలు అంటూ ఇబ్బందులకు గురి చేస్తోందని..బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ బెదిరింపులకు కేసీఆర్ భయపడరని తెలుసుకోవాలన్నారు.బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీలపై 5422 కేసులు మోపిందని కానీ కేవలం కేవలం 23 కేసుల్లో నే శిక్ష పడిందని గుర్తు చేశారు. తొమ్మిది రాష్ట్రాల్లో ఆదాని ఇచ్చిన డబ్బుతో బీజేపీ ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చివేసిందని..ఆరోపించారు రావెల కిషోర్ బాబు.

కాగా గతంలో ఐఆర్‌టీఎస్ అధికారిగాను..వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారిగా బాధ్యతలు నిర్వహించిన రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ తరపున పోటీచేసి.. వైసిపి అభ్యర్థిని మేకతోటి సుచరితపై విజయం సాధించారు.చంద్రబాబు మంత్రి వర్గంలో రావెలకు చోటు దక్కింది. అప్పట్లో ఆయన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. రావెల కిషోర్ బాబు కారణంగా పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయని పార్టీ నాయకత్వం భావించటంతో ఆయనను మంత్రివర్గం చంద్రబాబు తొలగించారు. మంత్రి పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందిన రావెల కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి ఆ తరువాత బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా పనిచేసిన రావెల కిషోర్ బాబు ఆ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తరువాత కొంతకాలానికి బీఆర్ఎస్ లో చేరారు.

ఇలా పలు పార్టీల్లో మారిన రావెల ఇప్పుడు బీఆర్ఎస్ పై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇక ఏపీలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయటానికి రావెల సిద్ధంగా ఉన్నారు. ఏ గూటికి చేరితే ఆ పలుకులు పలకటం రాజకీయనేతలకు అలవాటే. అలా ఇప్పుడు రావెల బీఆర్ఎస్ ను పొగిడేస్తూ..తన పాత పార్టీలైన బీజేపీ, టీడీపీలపై విమర్శలు సంధిస్తున్నారు.