ఏపీ బ‌డ్జెట్ 2020-21 రూ. రూ.2,24,789.18 కోట్ల అంచనా

  • Published By: madhu ,Published On : June 16, 2020 / 07:55 AM IST
ఏపీ బ‌డ్జెట్ 2020-21 రూ. రూ.2,24,789.18 కోట్ల అంచనా

ఏపీ బ‌డ్జెట్ 2020-21 ను శాస‌న‌స‌భ‌లో 2020 – 21 ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ప్ర‌వేశించారు. బ‌డ్జెట్ రూ. 2,47,879.18 కోట్ల అంచ‌నా వేశారు. రెవెన్యూ వ్య‌యం రూ. 1,80, 392.65 కోట్లు. మూల ధ‌న వ్య‌యం అంచ‌నా రూ. 44, 396.54 కోట్లుగా వెల్ల‌డించారు. రెవెన్యూ లోటు రూ. 18,434 కోట్లు, ఆర్థిక లోటు రూ. 48, 295.58 కోట్లు. జీడీపీ ఆర్థిక లోటు 4.78 శాతం కాగా..రెవెన్యూ లోటు రూ. 1.82 శాతంగా లెక్క క‌ట్టారు. 

ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొని ముందుకు పోతున్నామ‌ని, ప్రాణాల‌కు తెగించి ప్ర‌జా సేవ‌లో పాల్గొంటున్న ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నామ‌న్నారు. ఏడాదిలోగా ఇచ్చిన హామీల్లో 90 శాతం అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని, మేనిఫెస్టో అంటే ఎన్నిక‌లు అయిపోగానే..మ‌రిచిపోయే కాగితం కాద‌ని స‌భ‌లో వెల్ల‌డించారు. పాల‌కులు ప్ర‌జా సేవ పారాయ‌ణులు అయితేనే…స‌మాజం బాగుంటుంద‌న్నారు.

రైతులు, కౌలు రైతులు, త‌ల్లులు, యువ‌త స్వ‌యం ఉపాధిలో ఉన్న వారు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ముఖ్య స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టి, వారి ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికి నిరంత‌రం అంచ‌నాల‌కు మించి ప్ర‌భుత్వ కృషి చేస్తుంద‌న్నారు. 2018-19 సంవ‌త్స‌రంలో స్థూల ఉత్ప‌త్తి కేవ‌లం 8.8 శాతం మాత్ర‌మే పెరిగింద‌ని, రెండంకెల వార్షిక ప్ర‌గ‌తి సాధించామ‌ని గ‌త ప్ర‌భుత్వం చెప్ప‌డం అవాస్త‌వ‌మ‌ని తేలింద‌ని స‌భ‌లో స్ప‌ష్టం చేశారు మంత్రి బుగ్గ‌న‌.

అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మండలిలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమం సమ్మిళితం చేసేలా బడ్జెట్‌ను రూపొందించిన‌ట్లు వెల్ల‌డించారు. ఇక మంత్రి బుగ్గ‌న‌… అచ్చమైన తెలుగు కవితతో అసెంబ్లీలో‌ బడ్జెట్‌  ప్రసంగాన్ని ప్రారంభించ‌డం విశేషం.