ఏపీ బడ్జెట్ 2020-21, ఏ రంగానికి ఎంత కేటాయించారంటే

ఏపీ బ‌డ్జెట్ 2020-21ను ఆర్థికమంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి శాసనసభలో ప్ర‌వేశ పెట్టారు. రూ.2,24,789.18

  • Published By: naveen ,Published On : June 16, 2020 / 08:27 AM IST
ఏపీ బడ్జెట్ 2020-21, ఏ రంగానికి ఎంత కేటాయించారంటే

ఏపీ బ‌డ్జెట్ 2020-21ను ఆర్థికమంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి శాసనసభలో ప్ర‌వేశ పెట్టారు. రూ.2,24,789.18

ఏపీ బ‌డ్జెట్ 2020-21ను ఆర్థికమంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి మంగళవారం(జూన్ 16,2020) శాసనసభలో ప్ర‌వేశ పెట్టారు. రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను జగన్ ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో వరుసగా రెండోసారి బుగ్గన బడ్జెట్ ను ప్రవేశ పెట్టగా, మండలిలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ బడ్జెట్‌ను రూపొందించారు.

ఎన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొని ముందుకు పోతున్నామ‌ని, ప్రాణాల‌కు తెగించి ప్ర‌జా సేవ‌లో పాల్గొంటున్న ప్ర‌తీ ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు మంత్రి బుగ్గన. ఏడాదిలోగా ఇచ్చిన హామీల్లో 90 శాతం అమ‌లు చేయ‌డం జ‌రిగింద‌ని, మేనిఫెస్టో అంటే ఎన్నిక‌లు అయిపోగానే.. మ‌రిచిపోయే కాగితం కాద‌ని స‌భ‌లో వెల్ల‌డించారు. పాల‌కులు ప్ర‌జా సేవ పారాయ‌ణులు అయితేనే స‌మాజం బాగుంటుంద‌న్నారు.

రైతులు, కౌలు రైతులు, త‌ల్లులు, యువ‌త స్వ‌యం ఉపాధిలో ఉన్నవారు, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ముఖ్య స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టి, వారి ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చ‌డానికి నిరంత‌రం అంచ‌నాల‌కు మించి ప్ర‌భుత్వ కృషి చేస్తుంద‌న్నారు. 2018-19 సంవ‌త్స‌రంలో స్థూల ఉత్ప‌త్తి కేవ‌లం 8.8 శాతం మాత్ర‌మే పెరిగింద‌ని, రెండంకెల వార్షిక ప్ర‌గ‌తి సాధించామ‌ని గ‌త ప్ర‌భుత్వం చెప్ప‌డం అవాస్త‌వ‌మ‌ని తేలింద‌ని స‌భ‌లో స్ప‌ష్టం చేశారు మంత్రి బుగ్గ‌న‌.

ఏపీ బడ్జెట్‌(2020-21) హైలైట్స్:
రూ.2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌
రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు

రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపులు:
వ్యవసాయ రంగానికి రూ. 11,891 కోట్లు
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు
పశుగణాభివృద్ధి, మత్స్యరంగానికి రూ.1279.78 కోట్లు
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు
హోంశాఖకు రూ.5,988.72 కోట్లు
జలవనరుల శాఖకు రూ. 11,805.74 కోట్లు
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు
ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు
కార్మిక సంక్షేమానికి రూ. 601.37 కోట్లు
పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 16710.34 కోట్లు
న్యాయశాఖకు రూ. 913.76 కోట్లు
మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ. 8150.24 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ. 856.64 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రూ. 3,520.85 కోట్లు
ఆర్థిక రంగానికి రూ. 50,703 కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ. 6,984.72 కోట్లు
ప్రాథమిక ఉన్నత విద్యకు రూ. 22,604.01 కోట్లు
సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు
ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు
సవరించిన అంచనాలు 2019-20

సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ వ్యయం రూ. 1,37,518.07 కోట్లు
మూలధన వ్యయం రూ. 12,845.49 కోట్లు
రెవెన్యూ లోటు దాదాపుగా రూ. 26,646.92 కోట్లు
ఆర్థిక లోటు దాదాపుగా 40,493.46 కోట్లు
ఇవి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 2.47 శాతం, 3.75 శాతం​