ఏపీ కేబినెట్ : ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, కాపు మహిళలకు రూ. 15 వేలు

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 09:12 AM IST
ఏపీ కేబినెట్ : ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, కాపు మహిళలకు రూ. 15 వేలు

ఏపీ కేబినెట్ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్సార్ నవశకం కొత్త మార్గదర్శకాలకు, జగనన్న వసతి దీవెన పథకం, కాపు నేస్తం పథకాలకు ఆమోద ముద్ర వేసింది. కొత్త పెన్షన్ కార్డులు, పెన్షన్ అర్హతల మార్పు, రైస్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు, విద్యా దీవెన కార్డుల జారీ, వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, సీఆర్డీఏలో జరుగుతున్న పనుల నిర్మాణాలపై, కొత్త బార్ పాలసీపై కేబినెట్‌లో చర్చించినట్లు సమాచారం. 

> ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు ఆర్థిక సాయం, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేల ఆర్థిక సాయం, డిగ్రీ ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం. 
> ఎస్సీ, ఎస్టీ కమిషన్ విభజించి ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు. 
> పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలి. 
> ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ..రిజిస్ట్రేషన్‌కు నిర్ణయం.
> కాపు నేస్తం పథకానికి ఆమోదం. 
> కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ. 15వేల ఆర్థిక సాయం.
> 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ. 75 వేల సాయం. 
> నవశకం సర్వే ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం. 
> కాపు నేస్తం పథకానికి రూ. 1101 కోట్లు కేటాయింపు.
> టీటీడీ పాలక మండలి సభ్యుల సంఖ్యను 29కి పెంచుతూ నిర్ణయం.
> వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుల సవరణ.
Read More : శ్రీవారి భక్తులకు శుభవార్త