ఏపీ కేబినెట్ నిర్ణయాలు : 29న మూడో విడత రైతు భరోసా, సమగ్ర భూ సర్వే

ఏపీ కేబినెట్ నిర్ణయాలు : 29న మూడో విడత రైతు భరోసా, సమగ్ర భూ సర్వే

AP Cabinet decisions : ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, డిసెంబర్ 18వ తేదీ శుక్రవారం రెండున్నర గంటల పాటు జరిగిన మంత్రివర్గ సమావేశంలో… రైతు భరోసా పథకం, ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా ఆర్టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చ జరగడంతో పాటు ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్‌ అండ్ రీసెర్చ్ కార్పొరేషన్‌ ఏర్పాటు ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఏపీ పర్యాటక పాలసీ, ఏపీ బౌండరీ అండ్‌ చట్ట సవరణ, ఆరు జిల్లాల్లో వాటర్‌షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది.

సమగ్ర భూసర్వేకు ఏపీ కేబినెట్ ఆమోదం
సర్వే రాళ్లను ధ్వంసం చేసినా చట్టపరమైన చర్యలు
ల్యాండ్‌ సర్వే, బౌండరీ చట్టంలో 5 సవరణలకు ఆమోదం
సబ్‌ డివిజన్‌ ప్రకారం మ్యాప్‌ తయారీ
అక్షంశాలు, రేఖాంశాల ఆధారంగా భూ సర్వే

మూడేళ్లలో భూ సర్వే పూర్తి చేసి..భూ హక్కు పత్రాలు జారీ, ల్యాండ్‌ రికార్డులు తయారు.
తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీ ఏర్పాటు
నూతన పర్యాటక విధానానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం
ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం

6 జిల్లాల్లో వాటర్‌ షెడ్ల అభివృద్ధి పథకం అమలుకు ఆమోదం
కోవిడ్‌ వల్ల దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్టులు
పర్యాటక ప్రాజెక్టుల రీస్టార్ట్‌ ప్యాకేజీకి కేబినెట్‌ ఆమోదం
దెబ్బతిన్న పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద సాయం

కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న హోటళ్లు,..రెస్టారెంట్లు, టూర్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ ఏజెంట్లకు సాయం
రైతు భరోసా మూడో విడతకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
మూడో విడత రైతు భరోసా కింద..50 లక్షల 47 వేల మంది రైతులకు ప్రయోజనం

రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు రుణ సదుపాయం
సినిమా థియేటర్లు బాగు చేసుకునేందుకు..ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల ఫిక్స్‌డ్‌ పవర్‌ ఛార్జీలు రద్దు
థియేటర్లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు

ఇప్పటినుంచి ఏ సీజన్‌లో పరిహారం ఆ సీజన్‌లోనే రైతులకు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్నినాని తెలిపారు. నివర్‌ తుఫాను బాధితులకు ఈ నెలాఖరులోగా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. చంద్రబాబు బకాయిలు పెట్టిన 1200 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా జగన్‌ సర్కార్‌ చెల్లించిందని గుర్తుచేశారు. డిసెంబర్‌ 29న మూడో విడత రైతు భరోసాను రైతుల అకౌంట్‌లో జమ చేస్తామని… దీనిద్వారా 50 లక్షల 47 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి పేర్నినాని తెలిపారు. మూడో విడత కింద వెయ్యి 9 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తామన్నారు.