టీడీపీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ ఆమోదం: పేదలకు చేయూతనిచ్చే పలు నిర్ణయాలు

  • Published By: nagamani ,Published On : June 11, 2020 / 09:56 AM IST
టీడీపీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ ఆమోదం: పేదలకు చేయూతనిచ్చే పలు నిర్ణయాలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం పలికింది.  ‘వైఎస్‌ఆర్ చేయూత’ పథకానికి ఆమోదం పలికింది. భోగాపురం ఎయిర్ పోర్ట్, రామాయపట్నం పోర్టులకు ఆమోదముద్ర వేసింది. అంతేకాదు టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలు జరిగాయలనే ఉద్ధేశ్యంతో వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని కేబినెట్ నిర్ణయించింది.  ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల ఆర్థిక సహాయం చేయాటానికి ఆమోదం పలికింది. అలాగే జూన్ 16 నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురావాలని కూడా నిర్ణయించింది. 

ఈ సందర్బంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ..ఐదు సంవత్సరాల్లో రామయపట్నం పోర్టు నిర్మిస్తామని తెలిపారు. ఐదు దశల్లో దీన్ని నిర్మిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు పథకాల్లో భాగమైన షెడ్యూల్ తెగల్లోని మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని వీటిని ఏడాదికి రూ.18వేలు చొప్పున ఇస్తామని తెలిపారు. 

సాంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవించేవారికి  ‘జగనన్న తోడు’ పథకం కింద అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఉదాహరణకు కొండపల్లి బొమ్మల తయారీ..కలంకారీ కళాకారులకు, ఏటికొప్పాక వంటి సంప్రదాయ హస్తకళాకారులను బ్యాంకుల ద్వారా రూ.10వేలు సున్నా వడ్డీకింద లోను ఇప్పించేలా బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుదని చెప్పారు.

ఆలోనుకు అయిన వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద 77 గిరిజన మండలాల్లో అంటే షెడ్యూల్ ఏరియాల్లో గర్భంతో ఉండే మహిళలకు..బాలికలకు రక్తహీనత లేకుండా ఉండేందుకు పౌష్టికాహారాన్ని అందజేస్తామని తెలిపారు.