అమరావతి పోక తప్పదు : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్ కు చేరింది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది. రాజధాని అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కీలకంగా భావిస్తున్న

  • Published By: veegamteam ,Published On : January 20, 2020 / 04:40 AM IST
అమరావతి పోక తప్పదు : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు

ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్ కు చేరింది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది. రాజధాని అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కీలకంగా భావిస్తున్న

ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్ కు చేరింది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది. రాజధాని అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కీలకంగా భావిస్తున్న ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. సోమవారం(జనవరి 20,2020) ఉదయం సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ పేరు మార్పు, రైతులకు న్యాయం, హైపవర్ కమిటీ నివేదిక, ఇన్ సైడర్ ట్రేడింగ్ సహా పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చ జరిగింది. కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

హైపవర్ కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదించింది. అమరావతి రాజధాని ప్రాంత ఏరియా మొత్తాన్ని మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటుపై ప్రతిపాదన చేశారు. సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై లోకాయక్తకు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాజధాని రైతులకు ఇచ్చే పరిహారంపై చర్చించిన కేబినెట్.. వారి కోసం రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 11వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

ama

ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై అసెంబ్లీలో చట్టం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజధాని పేరెత్తకుండానే వికేంద్రీకరణ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో జగన్ ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇవాళ్టి నుంచి ఏసీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో విశాఖపట్నంలో పరిపాలన రాజధాని ఏర్పాటు… రాష్ట్రంలో మూడు రాజధానులు… అభివృద్ధి వికేంద్రీకరణ… సీఆర్డీఏ చట్టంలో మార్పు లాంటి కీలక నిర్ణయాలకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. ఈ నిర్ణయాలను ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విభేదిస్తుండటంతో సమావేశాలు గతంలో కంటే వాడీవేడిగా జరిగే అవకాశముంది.

far

అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. దీంతో రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త వాతారణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతం పోలీసుల భద్రతా వలయంలో ఉంది. నగరంలో 2వేల 500 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సీఎం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం నివాసం నుంచి సచివాలయం వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
* హైపవర్ కమిటీ నివేదికకు కేబినెట్ ఆమోదం
* సీఆర్డీఏ రద్దు
* మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఏర్పాటు
* అమరావతిలోనే మూడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణ
* కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
* విశాఖలో పరిపాలనా రాజధానికి కేబినెట్ ఆమోదం
* విశాఖకు రాజ్ భవన్, సచివాలయం, హెచ్ వోడీ ఆఫీసులు తరలింపునకు ఆమోదం
* అమరావతి రైతులకు మెరుగైన ప్యాకేజీకి తీర్మానం

* రాజధానికి భూములిచ్చిన రైతులకిచ్చే కౌలు పదేళ్ల నుంచి 15ఏళ్లకు పెంపు
* రైతులకిచ్చే పెన్షన్ రూ.2500 నుంచి రూ.5వేలకి పెంపు
* రాష్ట్రంలో 4 జోన్లు
* జిల్లాల విభజన తర్వాత సూపర్ కలెక్టర్ వ్యవస్థ అమలు
* CRDA బదులు AMRDA ఏర్పాటు

* మంత్రులు 2 చోట్ల ఉండాలని నిర్ణయం
* సీఆర్డీఏ ఉపసంహరణ, అధికార వికేంద్రీకరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం
* పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీకి ఆమోదం

* రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం
* 11వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలు
* కలెక్టర్ల వ్యవస్థలో మార్పులు చేసే విషయంపై కేబినెట్ లో చర్చ

* జిల్లాల సంఖ్యను పెంచే అంశంపై చర్చ

* 4 జిల్లాలకు కలిపి ఒక సూపర్ కలెక్టర్ వ్యవస్థ ఏర్పాటు అంశంపై చర్చ