CM Jagan : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. అజెండాలో హాట్ టాపిక్స్ ఇవే

సినిమా టికెట్లు, థియేటర్ల అంశంపై మాత్రం పెద్దగా నిర్ణయాలు ఉండకపోవచ్చు.

CM Jagan : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. అజెండాలో హాట్ టాపిక్స్ ఇవే

Ys Jagan

CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. అమరావతి సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ సమావేశం జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మొత్తం 32 అంశాలతో కేబినెట్ భేటీ అజెండాను రూపొందించారు.

Read This : AP Express Train : ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. భయంతో ప్రయాణికుల పరుగులు

ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ- PRC వ్యవహారం, ఉద్యోగుల ఆందోళనలపై కేబినెట్ లో ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. అంతా ఒక్కటే సమ్మె నోటీసు ఇచ్చాయి. దీంతో.. వారిని శాంతింపచేసేలా కేబినెట్ భేటీలో ఓ నిర్ణయం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ లో కరోనా స్టేటస్ పైనా కేబినెట్ భేటీలో రివ్యూ జరగనుంది. కరోనా మూడో వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతి, కట్టడి చర్యలు, కార్యాచరణపై జగన్ మంత్రులతో సమీక్ష చేస్తున్నారు.

Read This : Samantha : విడాకుల పోస్ట్ డిలీట్ చేసిన సమంత

రైతులకు విత్తన, ఎరువుల సరఫరా కోసం e-విక్రయ కార్పొరేషన్ ఏర్పాటుపై మంత్రి వర్గం చర్చించనుంది. ఇంధన శాఖకు సంబంధించిన మరో రెండు అంశాలను డిస్కస్ చేయనున్నారు. సినిమా టికెట్ల ధరల అంశంపైనా చర్చించే చాన్సుంది. ఐతే.. సినిమా టికెట్లు, థియేటర్ల అంశంపై మాత్రం పెద్దగా నిర్ణయాలు ఉండకపోవచ్చు.