AP Cabinet : నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..కీలక అంశాలపై చర్చ

ఏపీ మంత్రి మండలి ఇవాళ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. రాష్ట్ర పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు.. పక్క రాష్ట్రంతో ఉన్న విబేధాలు.. ఇలా అన్నింటిపై కూలంకశంగా సమీక్షించనుంది.

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..కీలక అంశాలపై చర్చ

Ap Cabinet

AP Cabinet Meeting : ఏపీ మంత్రి మండలి ఇవాళ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై చర్చించనుంది. రాష్ట్ర పరిస్థితులు, ప్రతిపక్షాల విమర్శలు.. పక్క రాష్ట్రంతో ఉన్న విబేధాలు.. ఇలా అన్నింటిపై కూలంకశంగా సమీక్షించనుంది. మంత్రిమండలి పలు ఆసక్తికర నిర్ణయాలను తీసుకోనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరిగే రాష్ట్ర కేబినెట్ బేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.

ప్రధానంగా కోవిడ్‌ నియంత్రణపై సర్కార్‌ తీసుకుంటున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలుతో పాటు ప్రధానంగా తెలంగాణతో జరుగుతున్న జల వివాదంపైనా మంత్రిమండలి చర్చించనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సమీక్షించనుంది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులపై ఇటీవల ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై చర్చించనున్నారు. ఈ విమర్శలను ప్రణాళిక బద్దంగా తిప్పికొట్టడంపై మంత్రులకు సీఎం జగన్ తగిన సూచనలు ఇవ్వనున్నారు. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం ప్రత్యేకంగా సమావేశం నిర్వహణపైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నారు. ఇటు వచ్చే నెలలో నిర్మాణం చేపట్టే మూడు లక్షల జగనన్న ఇళ్ల నిర్మాణంపై కేబినెట్‌ ఏపీ కేబినెట్ చర్చించనుంది.

దిశా చట్టం అమలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనపై చర్చించి.. ఇటీవల జరిగిన అఘాయిత్యాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించే అవకాశం ఉంది. నూతన ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. పేదల ఇళ్లపట్టాల క్రమబద్దీకరణకూ ఆమోదముద్ర వేయనుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తోన్న కోర్టు తీర్పులు తదితర అంశాలపై చర్చించనున్నారు మంత్రులు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు, బద్వేలు ఉప ఎన్నికపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, జాతీయ విద్యా విధానం, పాఠశాలలు, కళాశాలల పునః ప్రారంభంతో పాటు పలు అంశాలు చర్చించి మంత్రులు ఆమోదముద్ర వేయనున్నారు.