AP Cabinet : నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..పలు కీలక నిర్ణయాలు!

ఇక దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలకకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ఆమోదించనుంది.ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించే చట్ట సవరణకు ఆమోదించనుంది.

AP Cabinet : నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..పలు కీలక నిర్ణయాలు!

Ap Cabinet

AP cabinet : ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ ఇవాళ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్‌లో భేటీ అయ్యే మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధానంగా కోనసీమ జిల్లాకు బీఆర్‌ అంబేద్కర్‌ పేరుపెట్టడంపై మంత్రిమండలి చర్చించనుంది. నిబంధనల ప్రకారం అభ్యంతరాలకు ఇచ్చిన గడువు కూడా ముగియడంతో ప్రభుత్వం కోనసీమ జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరును ఖరారు చేసే అవకాశం వుంది.

ఇక దేవాదాయ శాఖ భూముల ఆక్రమణలకకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలపనుంది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ఆమోదించనుంది.ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్ల పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించే చట్ట సవరణకు ఆమోదించనుంది. ఈ నెల 27న అమ్మఒడి పధకం నిధులు విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది.

Jagan Delhi Tour : జగన్ ఢిల్లీ పర్యటన రద్దు.. యధావిధిగా కేబినెట్ భేటీ

35 సంస్థలకు భూ కేటాయింపులకూ ఆమోదం తెలుపనుంది. అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. సిఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో 50 కోట్లతో ఏర్పాటుచేయనున్న గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు కేబినెట్‌ అనుమతి ఇవ్వనుంది.