AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. విద్యుత్ ప్రాజెక్టులు, కడప స్టీల్ ప్లాంట్ కు ఆమోదం

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం (డిసెంబర్ 13,2022) జరిగిన మంత్రివర్గం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. విద్యుత్ ప్రాజెక్టులు, కడప స్టీల్ ప్లాంట్ కు ఆమోదం

AP Cabinet

AP Cabinet : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం (డిసెంబర్ 13,2022) జరిగిన మంత్రివర్గం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. SIPB ఆమోదించిన విద్యుత్ ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం లభించింది. అదాని, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

సామాజిక పెన్షన్లు 2750కి పెంపు, జనవరి1న పెరిగిన పెన్షన్లు పంపిణీకి కేబినెట్ ఆమోదం లభించింది. నాడు-నేడు ద్వారా స్కూల్స్ లో టీవీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 8వ తరగతి విద్యార్థులకు ఈ కంటెంట్ అందించడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉపాధ్యాయులకు బోధనేతర విధుల రద్దుకు జారీ చేసిన జీవోకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

AP Cabinet Key Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..జగనన్న, వైఎస్‌ఆర్‌ చేయూత నిధుల విడుదలకు ఆమోదం

ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండల కేంద్రాన్ని జుజ్జూరుకు మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 1301.68చ.కీమీ.పరిధితో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ ఆదారిటీ ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్ బుక్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.