AP Assembly : రాజధాని అమరావతి, ఉపసంహరణ బిల్లులో కీలక అంశాలివే

అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ మంత్రి బుగ్గన బిల్లును ప్రవేశపెట్టారు.

AP Assembly : రాజధాని అమరావతి, ఉపసంహరణ బిల్లులో కీలక అంశాలివే

Buggana

AP Capital Amaravati : ఏపీ రాజధాని విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ప్రవేశపెట్టిన బిల్లును వెన్కకి తీసుకుంటున్నట్ల, మరింత మెరుగైన బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొస్తామని అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటించారు. ఉపసంహరణ బిల్లులో కీలక అంశాలను పొందుపరిచారు. సీఆర్డీఏ (CRDA) చట్టాన్ని పునరుద్ధరిస్తూ శాసనసభలో బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏపీ పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టం రద్దు బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి 2021, నవంబర్ 22వ తేదీ సోమవారం ప్రవేశపెట్టారు.

Read More : AP Minister Buggana : రాజధానిపై మళ్లీ చర్చలు…మరింత మెరుగైన బిల్లును తీసుకొస్తాం

అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ అథారిటీని తక్షణం రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రద్దు చేసిన సీఆర్డీఏ చట్టాన్ని తిరిగి పునరుద్ధరిస్తూ మంత్రి బుగ్గన బిల్లును ప్రవేశపెట్టారు. ఏఎంఆర్డీఏ (AMRDA)కు బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులను తిరిగి సీఆర్డీఏ (CRDA)కు బదిలీ చేస్తున్నట్టు బిల్లులో ప్రస్తావించింది. భాగస్వాములతో పూర్తిస్థాయి సంప్రదింపులు జరపకపోవటం, శాసనమండలిలో బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లటం వంటి అంశాలు వికేంద్రీకరణ చట్టాన్ని వెనక్కు తీసుకోడానికి కారణాలు అంటూ వెల్లడించింది. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముందని భావిస్తున్నట్టు శాసనసభకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. తక్షణమే సీఆర్డీఏ చట్టం 2014 అమల్లోకి వస్తుందని వికేంద్రీకరణ చట్ట ఉపసంహరణ బిల్లులో వెల్లడించింది.

Read More : Amaravathi : రాజధాని అంశంపై సీఎం జగన్ సంచలన ప్రకటన..మళ్లీ బిల్లు తీసుకొస్తాం

ఈ బిల్లుపై సీఎం జగన్ మాట్లాడారు. మూడు రాజధానులకు సంబంధించిన బిల్లుల్లోని ప్రభుత్వ సదుద్దేశాన్ని విపులంగా వివరించేందుకు, చట్టపరంగాగానీ, న్యాయపరంగా గానీ అన్ని సమాధానాలను బిల్లులోనే పొందుపరచేందుకు, బిల్లుల్ని మరింత మెరుగుపరిచేందుకు, అన్ని ప్రాంతాలకు, అందరికీ, విస్తృతంగా వివరించేందుకు ఇంకా ఏవైనా మార్పులు అవసరమైతే వాటినికూడా పొందుపరుస్తామన్నారు. ఇంతకముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ఇంతకుముందు చెప్పిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మళ్లీ పూర్తి, సమగ్రమైన, మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుందని, విస్తృత, విశాల ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.’ అని సీఎం జగన్ సభలో ప్రకటించారు.