AP Capital Visakha : ఏపీ రాజధాని విశాఖ.. లోక్‌సభలో కేంద్రం ప్రకటన

ఏపీ రాజధానిపై ఇంకా క్లారిటీ లేదు. జనాల్లో ఫుల్ కన్ ఫ్యూజన్ ఉంది. ఏపీ రాజధాని అంశంపై రగడ జరుగుతోంది. రాజధాని అమరావతే అని కొందరు కాదని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అంశం

AP Capital Visakha : ఏపీ రాజధాని విశాఖ.. లోక్‌సభలో కేంద్రం ప్రకటన

Ap Capital Visakha

AP Capital Visakha : ఏపీ రాజధానిపై ఇంకా క్లారిటీ లేదు. జనాల్లో ఫుల్ కన్ ఫ్యూజన్ ఉంది. ఏపీ రాజధాని అంశంపై రగడ జరుగుతోంది. రాజధాని అమరావతే అని కొందరు కాదని మరికొందరు వాదనలు వినిపిస్తున్నారు. రాజధాని అంశంపై ఒక్కో పార్టీ ఒక్కో రకంగా స్పందిస్తోంది.

గత టీడీపీ ప్రభుత్వం ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం‌.. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎప్పుడైనా విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభం కావొచ్చని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. రాజధానిపై ఇలా గొడవ జరుగుతుండగానే.. కేంద్రం విడుదల చేసిన ఓ డాక్యుమెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఆ డాక్యుమెంట్‌లో ఏపీ రాజధానిగా వైజాగ్‌ను గుర్తించింది కేంద్రం. ఏపీ రాజధాని విశాఖ అంటూ లోక్ సభ సాక్షిగా స్పష్టం చేసింది కేంద్రం.

పెట్రోల్ ధరలపై లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రం డాక్యుమెంట్ రూపంలో సమాధానం ఇచ్చింది. అందులో రాష్ట్రాల రాజధానులు, పన్నుల వివరాలు, వాటి మధ్య వ్యత్యాసాన్ని చూపించింది. అదే డాక్యుమెంట్ లో ఏపీ రాజధానిగా వైజాగ్‌ పేరును కేంద్రం ప్రస్తావించింది. దీన్ని స్వయంగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ జారీ చేయడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంటే, ఏపీ రాజధానిగా వైజాగ్ ను కేంద్రం ఫిక్స్ చేసినట్టేనా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

గతంలో ఏపీ రాజధాని అంశం న్యాయపరిధిలో ఉందని కేంద్రం చెప్పింది. న్యాయపరిధిలో ఉన్న అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించడాన్ని అమరావతి జేఏసీ వ్యతిరేకిస్తోంది. ఏపీ రాజధానిపై చాలాకాలంగా రగడ నడుస్తోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని జేఏసీతో పాటు పలు సంఘాలు చాలాకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి.

కేంద్రం డాక్యుమెంట్ పై వైసీపీ నేతలు స్పందించారు. మూడు రాజధానులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి ఇదే సమాధానం అంటున్నారు. సీఎం జగన్ నిర్ణయానికి తిరుగేలేదని.. ఎవరు ఎన్ని మాట్లాడినా ఎగ్జిక్యూటివ్ కేపిటల్ వైజాగే అని.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అక్కడి నుంచే పరిపాలన ప్రారంభించే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా వైజాగ్ ను ఏపీ రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం విడుదల చేసిన డాక్యుమెంట్ ఏపీ రాజకీయాల్లో కొత్త అలజడి రేపింది.