ఏపీలో ప్రవేశ పరీక్షల రీ షెడ్యూల్: ఎంసెట్‌.. ఐసెట్‌.. దరఖాస్తు గడువు తేదీలు

  • Published By: vamsi ,Published On : May 20, 2020 / 07:59 AM IST
ఏపీలో ప్రవేశ పరీక్షల రీ షెడ్యూల్: ఎంసెట్‌.. ఐసెట్‌.. దరఖాస్తు గడువు తేదీలు

కరోనా కారణంగా ఆగిపోయిన అన్నీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల(సెట్స్‌)కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపులకు సంబంధించిన రివైజ్డ్‌ షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. అన్ని ‘సెట్స్‌’కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులు సమర్పించే గడువును జూన్‌ 15 వరకు పొడిగించినట్లు మండలి కార్యదర్శి బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ ప్రకటనలో తెలిపారు.

ఉన్నతవిద్యామండలి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ముందుగా జూలై 24న ఈసెట్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత 25న ఐసెట్ ఉంటుంది. జూలై 27నుంచి జూలై 31 వరకూ ఎంసెట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకూ పీజీఈసెట్ ను నిర్వహిస్తారు.

అలాగే ఆగస్టు 5వ తేదీన బీఈడీ విద్యార్ధుల కోసం ఎడ్ సెట్ నిర్వహిస్తారు. ఆగస్టు 6వ తేదీన లా కోర్సుల్లో ప్రవేశాల కోసం లా సెట్ నిర్వహించనున్నారు. ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకూ పీసెట్ ఉంటుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

ఎంసెట్‌: 
రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.500 చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుంతో జూన్‌ 30, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 9, రూ.5000 ఆలస్య రుసుంతో జూలై 17, రూ.10 వేల ఆలస్య రుసుంతో జూలై 23 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఈసెట్‌: 
ఫీజు రూ.550, రూ.1000 ఆలస్య రుసుంతో జూలై 16 వరకు.

ఐసెట్‌: 
రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.550, రూ.2000 ఆలస్య రుసుంతో జూన్‌ 30, రూ.5000తో జూలై 11, రూ.10 వేలతో జూలై 18వరకు.

పీజీఈసెట్‌: 
రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.1000, ఎస్సీ/ఎస్టీలు రూ.500… రూ.500 ఆలస్య రుసుంతో జూలై 5, రూ.1000తో జూలై 16, రూ.2000 ఆలస్య రుసుంతో జూలై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఎడ్‌సెట్‌: 
రిజిస్ర్టేషన్‌ ఫీజు రూ.600, ఎస్సీ/ఎస్టీలురూ.400, రూ.500 ఆలస్య రుసుంతో జూలై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

లాసెట్‌:
రిజిస్ర్టేషన్‌ ఫీజు(లాసెట్‌) రూ.750, (పీజీఎల్‌సెట్‌) రూ.850 చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుంతో జూలై 7, రూ.1000 ఆలస్య రుసుం తో జూలై 16, రూ.2000తో జూలై 25 వరకు సమర్పించవచ్చు.

పీఈసెట్‌:
రిజిస్ర్టేషన్‌ ఫీజు(ఇతరులు) రూ.850, ఎస్సీ/ఎస్టీలు రూ.650 చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుంతో జూలై 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Read: ప్రభుత్వ ఉద్యోగాలకు కనీస అర్హత ఇంటర్… ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం