AP CID Chief PV Sunil Kumar : ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో.. సీఐడీ చీఫ్ సునీల్ కీలక వ్యాఖ్యలు

ఎంపీ మాధవ్ వీడియోకు సంబంధించి టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదికలో వాస్తవాలు లేవని సునీల్ కుమార్ తేల్చి చెప్పారు. ఎంపీ మాధవ్ వీడియోకు సంబంధించి కొంతమంది ఓ సర్టిఫికెట్ ను విడుదల చేశారని, అది ఒరిజనల్ కాదని సునీల్ అన్నారు.

AP CID Chief PV Sunil Kumar : ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో.. సీఐడీ చీఫ్ సునీల్ కీలక వ్యాఖ్యలు

AP CID Chief PV Sunil Kumar : సంచలనం రేపిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై టీడీపీ విడుల చేసిన ఫోరెన్సిక్ నివేదిక గురించి ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ స్పందించారు. ఎంపీ మాధవ్ వీడియోకు సంబంధించి టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదికలో వాస్తవాలు లేవని సునీల్ కుమార్ తేల్చి చెప్పారు.

ఎంపీ మాధవ్ వీడియోకు సంబంధించి కొంతమంది ఓ సర్టిఫికెట్ ను విడుదల చేశారని, అది ఒరిజనల్ కాదని సునీల్ అన్నారు. ఆ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవ్ అంటూ ఓ సర్టిఫికెట్ ను కొంతమంది సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నారని, ఆ సర్టిఫికెట్ ఒరిజనల్ కాదని సునీల్ తేల్చి చెప్పారు.

‘ప్రైవేట్ ల్యాబ్ లు ఇచ్చే ఫోరెన్సిక్ నివేదికలో నిజం ఉండదు. గోరంట్ల మాధవ్ వీడియో నిజమని టీడీపీ విడుదల చేసిన నివేదిక నిజమైనది కాదు. రెండు ఫోన్లలో ఉండేదే ఒరిజినల్. సర్క్యులేట్ అయిన వీడియో నిజమైనది కాదు. ఫేక్ వీడియోను కానీ ఫేక్ డాక్యుమెంట్ ను కానీ సర్క్యులేట్ చేయడం నేరం. నిందితులపై చర్యలు తీసుకుంటాం” అని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ అన్నారు.

కాగా, ఎంపీ మాధవ్ వీడియోకు సంబంధించి టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఎలాంటి నివేదిక లేకుండానే ఎడిటింగ్, మార్ఫింగ్ చేశారని ఎస్పీతో చెప్పించారని.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపకుండా ఎడిటింట్, మార్ఫింగ్ అని ఎలా చెబుతారని టీడీపీ నేతలు ప్రశ్నించారు.

మాధవ్ వీడియో నిజమే అని వారు అన్నారు. ఆ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ అని అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసిందని టీడీపీ నాయకులు వెల్లడించారు. ఆ వీడియోలో ఎలాంటి మార్ఫింగ్, ఎడిటింగ్ జరగలేదని నివేదికలో పేర్కొన్నారని వారు తెలిపారు. మీ ఎంపీపై చర్యలు తీసుకోవడానికి ఈ సాక్ష్యాధారాలు సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. ఆ వీడియోను ప్రభుత్వం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపకుండానే ఎంపీ మాధవ్ కు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు.