సీఎం అయిన తర్వాత తొలిసారి సీబీఐ కోర్టుకు జగన్ 

ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ ముగిసింది.

  • Edited By: veegamteam , January 10, 2020 / 06:48 AM IST
సీఎం అయిన తర్వాత తొలిసారి సీబీఐ కోర్టుకు జగన్ 

ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ ముగిసింది.

ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత అక్రమాస్తుల కేసులో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అయితే కోర్టు హాజరుపై మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కోర్టు జగన్ కు షాక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించడంతో ఇద్దరు నేతలు న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో విచారణ ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు సీఎం జగన్ సీీబీఐ కోర్టులో ఉన్నారు. తదుపరి విచారణ జనవరి 17కు వాయిదా పడింది. 

గతంలో కోర్టు ఆదేశాల మేరకు జగన్ తోపాటు ఏ2గా విజయసాయిరెడ్డి ప్రత్యక్షంగా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. సీబీఐ కోర్టులో 11 చార్జీషీట్లకు సంబంధించి విచారణ జరిగింది. బయటి నుంచి లోపలికి ఎవరినీ కూడా అనుమతించడం లేదు. తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు జగన్ కోర్టుకు వస్తున్నాడని సమాచారం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. 

ప్రతిపక్ష హోదాలో రెండు సార్లు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒకసారి..మొత్తం మూడు సార్ల వరకు మినహాయింపు పిటిషన్లు దాఖలు చేశారు. కానీ ఇప్పటివరకు కోర్టు మాత్రం ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు  జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ పై సీబీఐ 11 చార్జీషీట్లు దాఖలు చేసింది. ప్రతి చార్జీషీట్ లో ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి పేర్లు సీబీఐ అధికారులు పొందుపరిచారు. ఈ కేసులో విచారణ ఎదురుకోవాల్సిందేనని సీబీఐ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే గతంలో మినహాయింపు పిటిషన్ కొట్టివేసిన సీబీఐ కోర్టు.. జనవరి 10న హాజరు కావాలని సీఎం జగన్ కు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు జగన్.. సీఎం హోదాలో తొలిసారి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. గతంలో అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోర్టుకు హాజరయ్యారు. తమిళనాడుకు చెందిన జయలలిత, కరుణానిధి తమ కేసుల్లో కోర్టుకు హాజరైన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ విభజన తర్వాత సీఎం హోదాలో మొట్టమొదటగా కోర్టుకు హాజరైన వ్యక్తి.. జగన్ అని చెప్పవచ్చు.