AP CM Jagan : పనిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులివ్వాలని సీఎం జగన్ ఆదేశం

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరు సరిగా లేదని స్పందన కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు చేశారు.

10TV Telugu News

AP CM Jagan : గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిపై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అధికారుల పనితీరు సరిగా లేదని స్పందన కార్యక్రమంలో సీఎం వ్యాఖ్యలు చేశారు. పనిచేయని అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలన్నారు. వీటి సమర్థత మెరుగుపడాలంటే పర్యవేక్షణ జరగాలని తెలిపారు. కలెక్టర్లు, జేసీలు, మున్సిపల్ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్ కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షణ చేయాలని సూచించారు.

వచ్చే స్పందన కార్యక్రమం వరకు నిర్ధేశించిన విధంగా నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలను పర్యవేక్షించాలన్నారు. విధులు సమర్థవంతంగా నిర్వహించని వారికి మెమోలు ఇవ్వాలన్నారు. ఇన్ స్పెక్షన్ చేయకపోతే సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. మొదట మనం మనుషులం..ఆ తర్వాతే అధికారులమని అన్నారు.

బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ అర్హులందరికీ అందాలని పేర్కొన్నారు. ఆగస్టు 10న నేతన్న హస్తం, 16న విద్యా కానుక ప్రారంభించనున్నట్లు తెలిపారు. రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులిస్తామని చెప్పారు.

10TV Telugu News