ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 10:45 AM IST
ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

ఆంధప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ మండలి సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షత జరిగిన ఈ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2019, నవంబర్ 27వ తేదీ బుధశారం నాడు జరిగిన ఈ కేబినెట్‌‌లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. వైఎస్సార్ నవశకం కొత్త మార్గదర్శకాలకు, జగనన్న వసతి దీవెన పథకం, కాపు నేస్తం పథకాలకు ఆమోద ముద్ర వేసింది. 
> నవశకం సర్వే ద్వారా వివిధ ప్రనభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం.
> కడప ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు కోసం ఎన్ఎండీసీతో ఒప్పందానికి ఆమోదం. డిసెంబర్ 26న శంకుస్థాపన. ఇందుకు 3 వేల 295 ఎకరాల భూ సేకరణ. 
> ఏపీ హై గ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటు.
> ఏపీఎస్‌పీడీసీలను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటు.
> జగనన్న వసతి దీవెన కింద రూ. 2 వేల 300 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ. 3 వేల 400 కోట్లు కేటాయింపు.
> ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు ఆర్థిక సాయం. 
> పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ. 15 వేల ఆర్థిక సాయం.
> డిగ్రీ ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు ఏడాదికి రూ. 20 వేలు ఆర్థిక సాయం. 
> ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను విభజించి ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు. 
> పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ. ఇళ్ల పట్టాలపై పేదలకు హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్‌కు నిర్ణయం. 
> టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు. 
> ఒప్పంద ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. 
> నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపిక.
> వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి రూ. 1101 కోట్లు. 
> కాపు మహిళలకు ఏడాదికి రూ. 15 వేల ఆర్థిక సాయం. 
> 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహఇళకు ఐదేళ్లలో రూ. 75 వేలు.
> రెండున్నర లక్షల ఆదాయం ఉన్న వారికి వర్తింపు.
> 10 ఎకరాలు మాగాణి, 25 ఎకరాల లోపు మెట్ట ఉన్న వారికి వర్తింపు. 
> వృత్తి కోసం ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ నడుపుకొనే వారికి మినహాయింపు.
> మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్. 
> కొత్తగా బియ్యం కార్డుల పంపిణీ.
Read More : ఏపీ కేబినెట్ : ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, కాపు మహిళలకు రూ. 15 వేలు