YS Jagan: నాలుగేళ్ల పాలనపై ఏపీ సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్ ..

దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తయిందని ఏపీ సీఎం జగన్ అన్నారు.

YS Jagan: ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు నాలుగేళ్లు పూర్తయింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో నాలుగేళ్లు ఏపీ అభివృద్ధి, పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు మంగళవారం ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. వైసీపీ పాలనకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ అధినేత, ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్‌ రెడ్డి ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Kodali Nani : వైఎస్ఆర్ బతికుంటే అలా జరగనిచ్చే వారు కాదు, జగన్‌ను కాపాడుకోవాలి- కొడాలి నాని

దేవుని దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. నాపై ఎంతో నమ్మకంతో మీరు ఈ బాధ్యతను అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ నాలుగేళ్ల కాలంలో 98శాతానికిపైగా ఎన్నికల హామీలను మన ప్రభుత్వంలో అమలు చేశాం అని జగన్ చెప్పారు. అదేవిధంగా ఈ నాలుగేళ్ల మన పాలనలో వివిధ రంగాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు మనస్ఫూర్తిగా కతృజ్ఙతలు తెలియజేస్తూ.. మన ప్రభుత్వంపై మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నానని సీఎం జగన్ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Seediri Appalaraju : చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు, మళ్లీ జగనే సీఎం- మంత్రి సీదిరి అప్పలరాజు