Government Jobs: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉగాది రోజున జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్ చేయనుంది ప్రభుత్వం.

Government Jobs: నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. ఏ శాఖలో ఎన్ని పోస్టులంటే..

Government Jobs

Government Jobs : ప్రభుత్వ ఉద్యోగాల కోసం తీవ్రంగా నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తోంది. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దాదాపు 20వేల పోస్టులకు ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉగాది రోజున జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్ చేయనుంది ప్రభుత్వం.

ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు..
* గ్రామ, వార్డు సచివాలయాల్లో 8వేల 402 పోస్టులు
* గ్రామ సచివాలయాల పరిధిలో యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్ పోస్టులు-6,099
* పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలు
ఏపీపీఎస్సీ ద్వారా ఉగాది సందర్భంగా వచ్చే జాబ్ క్యాలెండర్ లో పోలీస్ జాబ్స్ కు సంబంధించిన ప్రకటన కూడా ఉండే చాన్స్.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇంకా 8,402 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదివరకే ప్రకటించారు. ఏపీపీఎస్సీకి పోస్టుల వివరాలు పంపి భర్తీ చేస్తామన్నారాయన. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్లు, సచివాలయాల్లో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇప్పటికే సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఖాళీగా ఉన్న 6వేల 99 యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్స్‌ పోస్టుల త్వరలో భర్తీ కానున్నాయి.

అలాగే వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ వెటర్నరీ లాబ్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2021 జూన్‌ 1 నాటికి ఈ భవనాలన్నీ సిద్ధం కావాలని సీఎం ఆదేశించడంతో.. కొత్తగా 21 ల్యాబ్‌ టెక్నీషియన్స్, 21 ల్యాబ్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APCPDCL) గ్రామ, వార్డు సచివాలయాల కింద 86 ఎనర్జీ అసిస్టెంట్ల (జేఎల్‌ఎం గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రానుందన్న వార్త నిరుద్యోగుల్లో కొంత ఆనందం నింపింది. ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలన్న లక్ష్యంతో ఉన్నవారు అప్పుడే ప్రిపరేషన్ మొదలెట్టేశారు.