CM Jagan On 175 Target : ఈసారి దెబ్బకొడితే.. కనుచూపుమేరలో కనబడకూడదు-సీఎం జగన్ హాట్ కామెంట్స్

వచ్చే అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈసారి ఎన్నికల్లో గట్టిగా కొట్టాలి. 175కు 175 సీట్లు మనమే సాధించాలి. ఒక్కసారి అలా సాధిస్తే 30ఏళ్ల వరకు మనకు తిరుగుండదు.

CM Jagan On 175 Target : ఈసారి దెబ్బకొడితే.. కనుచూపుమేరలో కనబడకూడదు-సీఎం జగన్ హాట్ కామెంట్స్

CM Jagan On 175 Target : టార్గెట్ 175 అంటున్నారు ఏపీ సీఎం జగన్. పదే పదే ఈ టార్గెట్ గురించి పార్టీ శ్రేణులకు చెబుతున్నారు. తాజాగా మరోసారి పార్టీ శ్రేణులకు క్లీన్ స్వీప్ గురించి హాట్ కామెంట్స్ చేశారు జగన్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు సాధించాలన్నారు ఏపీ సీఎం జగన్. ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలని, అందుకు అంతా విభేదాలు మరిచి కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఒక్కసారి 175 సీట్ల టార్గెట్ సాధిస్తే మరో 30ఏళ్ల వరకు మనకు తిరుగుండదన్నారు సీఎం జగన్.

Also Read..YS Jagan Birthday: ధైర్యం, పట్టుదలతో లక్ష్యానికి గురిపెట్టి.. ప్రజానేతగా ఎదిగిన జగన్..

”వచ్చే అసెంబ్లీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈసారి ఎన్నికల్లో గట్టిగా కొట్టాలి. 175కు 175 సీట్లు మనమే సాధించాలి. ఒక్కసారి అలా సాధిస్తే 30ఏళ్ల వరకు మనకు తిరుగుండదు. దేవుడి దయ వల్ల రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు ఇప్పుడు జరుగుతోంది.

Also Read..CM Jagan : సొంత పార్టీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్..?

ఈ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఒక్కసారి అలాంటి దెబ్బ కొట్టామంటే ఇక కనుచూపు మేరలో పూర్తిగా 30 సంవత్సరాల పాటు మంచి పరిపాలన అనేది జరుగుతుంది. కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉన్నా దయచేసి అందరం పక్కన పెడదాం. విభేదాలను పక్కన పెట్టి అందరం ఒక్కటవుదాం. కలిసి కట్టుగా పని చేద్దాం. టార్గెట్ సాధిద్దాం” అని పార్టీ నాయకులతో చెప్పారు సీఎం జగన్.