CM Jagan Vaccine : ఎలాగైనా తెస్తాం, ఉచితంగా ఇస్తాం.. అసెంబ్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేవారు. ఏపీలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే 7కోట్ల డోసులు కావాలని అన్నారు. వాటిని ఎలాగైనా తెచ్చి ప్రజలందరికి ఉచితంగా టీకాలు వేస్తామని తెలిపారు. మొదటి ప్రయారిటీ 45ఏళ్లు దాటిన వారికే

CM Jagan Vaccine : ఎలాగైనా తెస్తాం, ఉచితంగా ఇస్తాం.. అసెంబ్లీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Cm Jagan On Corona Vaccine

CM Jagan On Corona Vaccine : ఏపీలో వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేవారు. ఏపీలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే 7కోట్ల డోసులు కావాలని అన్నారు. వాటిని ఎలాగైనా తెచ్చి ప్రజలందరికి ఉచితంగా టీకాలు వేస్తామని తెలిపారు. మొదటి ప్రయారిటీ 45ఏళ్లు దాటిన వారికే అన్నారు. టీకాలపై నిజాలు తెలిసినా కొందరు రాజకీయం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. గ్లోబల్ టెండర్లు పిలిచిన మొదటి రాష్ట్రం ఏపీ అని, రెండో విడతలో మిగతా వారందరికీ టీకాలు వేస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. ఇన్ని అడుగులు వేస్తున్నా కొన్ని చోట్ల మరణాలు నివారించ లేక పోతున్నాం. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే మిగతా అందరికి వస్తోంది. కొన్ని సందర్భాల్లో కోవిడ్ తో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతున్నారు. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అలాంటి ఘటనలు నా మనసుకు చాలా కష్టం అనిపించాయి. అటువంటి పిల్లల కోసం(తల్లి, తండ్రిని కోల్పోయిన) రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. దాని మీద వచ్చే వడ్డీ పిల్లలకు నెల నెల అందేలా చేస్తే దాంతో పిల్లలు బతికేస్తారు. ఆ తర్వాత 25ఏళ్ల వయసు వచ్చాక వారికి ఏదో ఒక విధంగా ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఆ స్కీమ్ ని ఫైనలైజ్ చేశాము.

”దేశానికి మొత్తం అర్థమయ్యే విధంగా ఏపీలో వ్యాక్సినేషన్ చేసి చూపించాం. ఒకే రోజు 6లక్షల 24వేల మందికి వ్యాక్సిన్ వేసి ఇదీ నా కెపాసిటీ అని చెప్పి దేశానికి చూపించగలిగాం. ఒక్క రోజులో 10లక్షల మందికి కూడా వ్యాక్సిన్ వేయగల కెపాసిటీ మాకుంది, మాకు వ్యాక్సిన్లు ఇవ్వండి అని కేంద్రానికి విజ్ఞప్తి చేశాము. ఇంత చేస్తున్నా ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే మాదిరిగా మనము కూడా.. అన్నీ బాగా జరిగితే నా వల్లే జరిగాయని, అన్నీ బాగా జరగలేదనుకో.. వేరే వాళ్ల మీద వేలెత్తి చూపి, వాళ్ల వల్ల నేను సరిగా చేయలేకపోయాను అని చెప్పి మనమూ అనొచ్చు. కానీ, ఈ కోవిడ్ సమయంలో మనం ఎవరిమీదనో వేలెత్తి చూపించి సాధించేది ఏముంది.

కోవిడ్ సమయంలో అందరం కలవాలి. తప్పులు జరిగితే వేలెత్తి చూపించడం ద్వారా సాధించేది ఏమీ లేదు. అందరమూ మనుషులమే. ఎక్కడో ఒక చోట తప్పు జరిగి ఉండొచ్చు. జరిగిన తప్పుని వేలెత్తి చూపించడం కాకుండా ఒకరినొకరు ప్రోత్సహించడం నేర్చుకోవాలి. కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం మనల్ని చూస్తోంది. ఏ విధంగా మనం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం అని ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు, మీడియాకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మాదిరిగా ప్రజల మనోధైర్యాలను దెబ్బతీసే వార్తలను కానీ, అసత్య వార్తలు కానీ, అర్థ సత్యాలకు కానీ, అపోహలు కానీ ఇలాంటివి ప్రసారం చేసి, ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసి నిలబడే ప్రాణాన్ని కూడా ఆడే గుండెను కూడా ఆపేయకండి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా” అని సీఎం జగన్ అన్నారు.

”18 నుంచి 45 ఏళ్ల వారికి 120 కోట్ల డోసులు కావాలి. మొత్తం 172 కోట్ల డోసులు కావాలి. కానీ మన దేశంలో 7కోట్ల డోసులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. దేశవ్యాప్తంగా 11శాతం కూడా వ్యాక్సినేషన్ జరగలేదు. ఏపీలో 45ఏళ్లు పైబడిన వారు కోటి 48లక్షలు. ఏపీలో 45ఏళ్లు పైబడిన వారికి దాదాపు 3కోట్ల డోసులు కావాలి. ఏపీలో 45ఏళ్ల లోపు వారికి 4కోట్ల డోసులు కావాలి. ఏపీకి మొత్తం 7కోట్ల డోసులు కావాలి” అని సీఎం జగన్ అన్నారు.