CM Jagan : విద్యార్థుల భవిష్యత్తుకే నష్టం, కేవలం పాస్ అని ఉంటే మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా?

ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా/రద్దు వేయాలన్న డిమాండ్లపై సీఎం జగన్ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నలు సంధించారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‌కే నష్టం అని సీఎం జగన్ చెప్పారు. విద్యార్థుల 50ఏళ్ల భవిష్యత్తు సర్టిఫికెట్ల పైనే ఆధారపడి ఉందన్నారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే.. భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారన్నారు. పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు.

CM Jagan : విద్యార్థుల భవిష్యత్తుకే నష్టం, కేవలం పాస్ అని ఉంటే మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా?

Cm Jagan Exams

CM Jagan Exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా/రద్దు వేయాలన్న డిమాండ్లపై సీఎం జగన్ స్పందించారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలకు ప్రశ్నలు సంధించారు. పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‌కే నష్టం అని సీఎం జగన్ చెప్పారు. విద్యార్థుల 50ఏళ్ల భవిష్యత్తు సర్టిఫికెట్ల పైనే ఆధారపడి ఉందన్నారు. పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్‌ అని ఇస్తే.. భవిష్యత్‌లో విద్యార్థులు నష్టపోతారన్నారు. పాస్‌ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? అని ప్రశ్నించారు.

టెన్త్‌, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విమర్శలు చేస్తున్నారని జగన్ వాపోయారు. విపత్కర పరిస్థితుల్లో అగ్గిపెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు రద్దు చేయాలని అడగడం సులభమే.. కానీ నష్టపోయేది విద్యార్థులే అని జగన్‌ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ గురించి తన కంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షలు అన్న సీఎం జగన్.. విద్యార్థులకు నష్టం చేయం అన్నారు.

పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం లేదన్నారు సీఎం జగన్. అంతేకాదు పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్ధుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీఎం చెప్పారు. మార్కులను బట్టే ఏ విద్యార్ధికైనా భవిష్యత్తు ఉంటుందన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటామని చెప్పారు. పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. కష్టతరమైనా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

* టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు
* ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం నేను ఆలోచిస్తా
* విపత్కర పరిస్థితుల్లో కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు
* పరీక్షల నిర్ణహ విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది
* కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి
* టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది
* మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుంది

* టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం
* కోవిడ్ పై పోరాటంలో కచ్చితంగా గెలుస్తాం
* టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‍కే నష్టం
* విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు
* పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్ అని ఇస్తే.. భవిష్యత్‍లో విద్యార్థులు నష్టపోతారు