SSC, Inter Exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక నిర్ణయం

ఏపీలో పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషప్ పై సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు.

SSC, Inter Exams : ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై సీఎం జగన్ కీలక నిర్ణయం

Ssc, Inter Exams

SSC, Inter Exams :  ఏపీలో పరీక్షలు యథాతథంగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ పరీక్షలు జరుగుతాయని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. కరోనా నియంత్రణ, వ్యాక్సినేషప్ పై సమీక్షలో సీఎం జగన్ ఈ మేరకు పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. విద్యాపరంగా విద్యార్థులకు నష్టం జరక్కూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దన్నారు.

కాగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పరీక్షలు రద్దు చేయడం, వాయిదా వేయడం చేశాయి. తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేసిన ప్రభుత్వం, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలు మాత్రం వాయిదా వేసింది. ఏపీలోనూ కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పిల్లల క్షేమం కోసం పరీక్షలు రద్దు చేయాలని కోరుతున్నారు. ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నాయి. పరీక్షల పేరుతో పిల్లల జీవితాలతో ఆడుకోవద్దని కోరుతున్నాయి. ఎగ్జామ్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం జగన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాగా, షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు.