CM Jagan : కరోనా సమస్యకు అదొక్కటే పరిష్కారం, సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఈ క్రమంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కోవిడ్‌ నియంత్రణకు మన దగ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్‌ అని సీఎం జగన్ అన్నారు. కరోనా సమస్యకు తుది పరిష్కారం వ్యాక్సినేషన్ అని చెప్పారు. అందుకే వ్యాక్సిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులతో చెప్పారు.

CM Jagan : కరోనా సమస్యకు అదొక్కటే పరిష్కారం, సీఎం జగన్ కీలక ఆదేశాలు

Cm Jagan Corona Virus

CM Jagan Corona Virus : ఏపీలో కరోనావైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. వేగంగా వ్యాపిస్తూ ప్రాణాలు తీస్తోంది. తాజాగా రాష్ట్రంలో 6వేలకు పైగా కొత్త కేసులు, 20 మరణాలు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం(ఏప్రిల్ 15,2021) ఒక్కరోజే 6వేల 96 కరోనా కేసులు బయటపడ్డాయి.

కోవిడ్ ని అంతం చేసే అస్త్రం వ్యాక్సిన్:
ఈ క్రమంలో సీఎం జగన్ అలర్ట్ అయ్యారు. కరోనా కట్టడి చర్యలపై అధికారులతో చర్చించారు. వారికి కీలక ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. కోవిడ్‌ నియంత్రణకు మన దగ్గరున్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్‌ అని సీఎం జగన్ అన్నారు. కరోనా సమస్యకు తుది పరిష్కారం వ్యాక్సినేషన్ అని చెప్పారు. అందుకే వ్యాక్సిన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులతో చెప్పారు.

వాక్సిన్‌ను వృథా చేయొద్దు:
అదే విధంగా కోవిడ్‌ టెస్టులు, ఆసుపత్రులను సన్నద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హెల్త్‌కేర్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు తప్పనిసరిగా టీకా వేయాలని, ఎక్కడా కోవిడ్‌ వాక్సిన్‌ను వృథా చేయొద్దన్నారు. ఈ మేరకు కోవిడ్‌19 నియంత్రణ, నివారణ, కరోనా వాక్సినేషన్‌పై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ శుక్రవారం(ఏప్రిల్ 16,2021) వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్, మౌలిక సదుపాయాలు, మెడికేషన్, డాక్టర్లు, పారా మెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు సీఎం జగన్. ఇవన్నీ మన బాధ్యత అన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారాయన.

ఏపీలో కోరలు చాచిన కరోనా:
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,962 పరీక్షలు నిర్వహించగా.. 6,096 కేసులు నిర్ధారణ కాగా.. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,48,231 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం(ఏప్రిల్ 16,2021) వెల్లడించింది. చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, కడప, కర్నూలు‌, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7వేల 373కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,194 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,05,266కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35వేల 592 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,56,06,163 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా చిత్తూరులో 1,024.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి.

ఆ 5 జిల్లాల్లో 500లకు పైగా కేసులు:
ఏపీలోని ఐదు జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. చిత్తూరు జిల్లాపై కోవిడ్ పంజా విసిరింది. చిత్తూరు జిల్లాలో 1024 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు జిల్లాలో 735, కర్నూలు జిల్లాలో 550, శ్రీకాకుళం జిల్లాలో 534 కేసులు నమోదయ్యాయి.