CM Jagan : వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్

దేశంలోనే ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో సంచార పశు అంబులెన్స్ తీసుకురానున్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

CM Jagan : వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలను ప్రారంభించిన సీఎం జగన్

Pashu Mobile

CM Jagan : ఏపీ ప్రభుత్వం 108 అంబులెన్స్‌ తరహాలోనే మూగజీవాల ఆరోగ్య పరిరక్షణ కోసం వాహనాలను ప్రవేశపెట్టింది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వం తీసుకొచ్చిన డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు వైద్యశాలలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ పథకం ద్వారా దాదాపు 278 కోట్ల రూపాయలతో 340 వాహనాలు కొనుగోలు చేసింది. దీంతో పాటు వాటి నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వాహనం చొప్పున 175 వాహనాలను సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Mobile

డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ పథకం ద్వారా ప్రస్తుతం మొదటి దశలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 142కోట్ల 90లక్షల రూపాయలతో 175 వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండో దశలో 134కోట్ల 74 లక్షలతో మిగిలిన 165 వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో సైతం పాడి పశువులతో పాటు, పెంపుడు జంతువులకు అత్యవసరమైన, నాణ్యమైన పశువైద్యసేవలు అందించనున్నారు. ఇందుకు వీలుగా ఒక్కొక్క వాహన నిర్వహణకు నెలకు లక్షా 90వేల రూపాయల చొప్పున నిధులను కేటాయించింది.

Cow : ఆవుల కోసం అంబులెన్స్ ..ఏ రాష్ట్రంలో తెలుసా ?

ప్రతి పశువుల అంబులెన్స్‌లో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌ ఉండనున్నారు. 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల, అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులు ఉంటాయి. ప్రాథమిక వైద్యసేవలతోపాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి ఆపరేషన్ చేసే సౌలభ్యం.

Catle

దేశంలోనే ఎక్కడా లేని విధంగా అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో సంచార పశు అంబులెన్స్ తీసుకురానున్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ అంబులెన్స్ సేవల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1962ను ఏర్పాటు చేశారు. ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య చెబితే అంబులెన్స్ రైతు వద్దకే వెళ్లి పశువులకు వైద్య సేవలు అందిస్తారు.

Insurance Scheme : రైతులకు మేలు చేస్తున్న పశువుల బీమా పథకం..

అవసరమైతే పశువును సమీపంలోని ఏరియా పశువైద్యశాలకు లేదా వెటర్నరీ పాలీక్లినిక్ కు తరలిస్తారు. మెరుగైన వైద్య సేవలందించి తిరిగి ఆ పశువును సురక్షితంగా రైతు ఇంటికి ఉచితంగా చేరవేస్తారు. ప్రస్తుతం ఈ అంబులెన్స్ లు విజయవాడ సమీపంలోని ముస్తాబాద శివారులో బారులు తీరి ఉన్నాయి.