CM Jagan Delhi : ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. రేపటి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.

CM Jagan Delhi : ఢిల్లీ బయల్దేరిన ఏపీ సీఎం జగన్

CM Jagan

CM Jagan Delhi : ఏపీ సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. రేపటి గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం ఇన్వెస్టర్ల సమ్మిట్ లోనే పాల్గొంటారు. సీఎం జగన్ వెంట సీఎస్ జవహర్ రెడ్డి, సీఎం స్పెషల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నమే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లాల్సివుంది కానీ ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.

గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ఈ లోపాన్ని పైలట్ గుర్తించారు. వెంటనే తిగిరి గన్నవరం ఎయిర్ పోర్టులోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సాంకేతిక లోపం కారణంగా ఆయన ఢిల్లీ ప్రయాణం అర్ధాంతరంగ ఆగిపోయింది. దీంతో కాసేపటికి క్రితం మరోసారి సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు.

CM Jagan Plane Technical Fault : సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

అంతకముందు సీఎం జగన్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సాకేంతిక లోపంతో గన్నవరంలో పైలట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు.

వెంటనే తిరిగి గన్నవరం ఎయిర్ పోర్టులోనే విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి సీఎం జగన్ ఢిల్లీ బయల్దేరిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరిగి గవ్నవరం ఎయిర్ పోర్టులో విమానాన్ని పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.