Jagan Meets Modi : ప్రధానితో ముగిసిన జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్.. ప్రధానితో చర్చించారు.

Jagan Meets Modi : ప్రధానితో ముగిసిన జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Jagan Meets Modi

Jagan Meets Modi : ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కీలక అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలు, రాష్ట్ర రుణపరిమితిపైనా చర్చించినట్లుగా సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ నిధులు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు జగన్. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావాల్సిన నిధులను ఇప్పించాలని ప్రధానిని కోరారు జగన్.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ వెంట ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ప్రధానితో జగన్ భేటీ.. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా వైసీపీ ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోఈ అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

ప్రధాని స‌హా ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో భేటీ కోసం గురువారం మ‌ధ్యాహ్నం ఢిల్లీ వెళ్లిన జ‌గ‌న్‌… సాయంత్రం 4.30 గంట‌ల‌కు మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. దాదాపుగా 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ప‌లు పెండింగ్ అంశాలపై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

YS Jagan : రేపు ఢిల్లీ వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి

మోదీతో భేటీని ముగించుకున్న జ‌గ‌న్ అటు నుంచి అటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌తో భేటీ కోసం వెళ్లారు. నిర్మ‌ల‌తో భేటీ ముగిసిన త‌ర్వాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోనూ జ‌గ‌న్ భేటీ అయ్యే అవ‌కాశాలున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అమిత్ షా, జ‌గ‌న్‌ల భేటీ రాత్రి 9 గంట‌ల త‌ర్వాత జ‌రిగే అవ‌కాశాలున్న‌ట్లు స‌మాచారం.

CM Candidate Pawan Kalyan : సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్..? టీడీపీకి చెక్ పెట్టేలా బీజేపీ స్కెచ్..?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ తో ప‌లు అంశాల‌పై జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రిపారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు మొదలైన‌ వీరి భేటీ కేవ‌లం 10 నిమిషాల్లోనే ముగియ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి, అప్పులు, ప‌న్నుల రాబ‌డి, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న స‌హ‌కారం, ఇంకా అందాల్సిన మ‌ద్ద‌తు త‌దిత‌రాల‌ను కేంద్ర మంత్రికి జ‌గ‌న్ వివ‌రించిన‌ట్లు స‌మాచారం.