CM Jagan : అందుకే.. అప్పు చేసైనా కొనసాగిస్తున్నాం

ఏపీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతబడి పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అందుకే అప్పు చేసైనా సం

CM Jagan : అందుకే.. అప్పు చేసైనా కొనసాగిస్తున్నాం

Cm Jagan

CM Jagan : ఏపీలో సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేకపోతే పరిశ్రమలు మూతబడి పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని.. అందుకే అప్పు చేసైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. తాము పెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలోనూ పథకాలను ఆపలేదని సీఎం తెలిపారు. ప్రభుత్వం ఇంత చేస్తుంటే సంక్షేమ పథకాల విషయంలో ప్రతిపక్షాలు దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నాయని జగన్ మండిపడ్డారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఈ రెండున్నరేళ్లలో 68 భారీ, మెగా పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు.

Bigg Boss 5 : ఈసారి టఫ్ అండ్ ఛాలెంజింగ్‌గా అనిపించింది – ‘కింగ్’ నాగార్జున..

రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్‌/ స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహక నిధులను సీఎం విడుదల చేశారు. తమ ప్రభుత్వంలో పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించామని.. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని గుర్తు చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే అవి రోడ్డున పడే పరిస్థితి ఉందని.. ఎంఎస్‌ఎంఈలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని జగన్‌ చెప్పారు. గతంలో హడావుడి ఎక్కువగా.. పని తక్కువగా ఉండేదని చంద్రబాబు ప్రభుత్వంపై సీఎం జగన్ విమర్శలు చేశారు.

కరోనా కష్టకాలంలో వరుసగా రెండో ఏడాది కూడా పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని జగన్ స్పష్టం చేశారు. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదన్న లక్ష్యంతో ఈ ఏడాది కూడా ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్లులకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తోందని జగన్ తెలిపారు.

Karimnagar : రహస్య యాప్ తో భార్య ఫోన్ ట్యాపింగ్

గతేడాది మే 22న తొలిసారిగా రీస్టార్ట్‌ ప్యాకేజీ పేరుతో రూ.1,100 కోట్ల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలను జగన్ విడుదల చేశారు.