రాష్ట్రంలోనే కాదు..బైట రాష్ట్రాలకు కూడా బస్సులు నడపేందుకు అన్నీ రెడీ : మంత్రి పేర్ని నాని

10TV Telugu News

లాక్ డౌన్ ప్రభావంతో బాధపడుతున్న వలస కూలీలు ఎటువంటి ఇబ్బందులు పడకూదని వారిని వారి వారి స్వస్థలాలకు బస్సుల్లో చేర్చాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు పనులు చకచకా జరుగుతున్నారు. సీఎం ఆదేశాలల్లో భాగంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ..వలస కార్మికులను తరలించే విషయంలో  చర్యలు తీసుకుంటున్నామనీ..సీఎం ఆదేశాల మేరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఒక్కో జిల్లానుంచి 10 బస్సులు నడుపుతామని దీంట్లో భాగంగా మొదటిసారి 230 బస్సులు సిద్ధంగా ఉన్నాయని..ఒక్కో బస్సులోనే కేవలం 20మంది మాత్రమే అనుమతిస్తున్నామని..ప్రయాణీకులు భౌతిక దూరం పాటించేందుకు ఇలా చేస్తున్నామని తెలిపారు.  దీనికి సంబంధించిన అన్ని వివరాలతోను సిద్ధం చేసిన ఫైల్ ను సీఎం జగన్ కు పంపించామన్నారు. 

ఏపీలో చిక్కుకున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపేందుకు అలాగే రాష్ట్రం లోపల అంటే ఏపీలో ఉండే 10 జిల్లాల్లోని వారు వేరే వేరే జిల్లాలకు వలస వెళ్లిన కూలీలను వారి ప్రాంతాలకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామనీ..దీనికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.  దీనికి సంబంధించి ఆర్టీసీ టిక్కెట్ల బుక్కింగ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవటంలో భాగంగా ప్రయాణీకులు బస్సులో కూర్చునే విషయంలో భౌతిక దూరం పాటించేలా చేస్తున్నామన్నారు.  

పల్లె వెలుగు బస్సుల్లో మార్కంగ్ సిస్టం అమచేస్తున్నామన్నారు. అంతేకాదు అన్ని బస్సుల్లోను యాంటీ వైరల్ స్పైలు అందుబాటులో ఉంటాయనీ..ప్రతీ ప్రయాణీకుడు తప్పని సరిగా మాస్కులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని దీనికి సంబంధించి అన్ని రకాల చెక్కింగులు పూర్తయ్యాకనే ప్రయాణానికి బస్సులు కదులుతాయని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు.