YSR Awards Ceremony: అ‘సామాన్యులకు’ అవార్డులు ఎంతో గర్వకారణం.. సీఎం జగన్‌మోహన్ రెడ్డి

దేశంలో ఎక్కాడాలేని విధంగా తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

YSR Awards Ceremony: అ‘సామాన్యులకు’ అవార్డులు ఎంతో గర్వకారణం.. సీఎం జగన్‌మోహన్ రెడ్డి

YSR Awards Ceremony: సామాన్యుల్లోని అసమాన్యుల సేవలను ప్రత్యేకంగా గుర్తించి రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డులకు గర్వకారణంగా నిలుస్తాయని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. సమాజంలో అసమాన్య సేవలు అందిస్తున్న ప్రముఖులు, మానవతా మూర్తులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వరుసగా రెండో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తరపున (వైఎస్సార్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌) అత్యున్నత అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో గవర్నర్ ముఖ్యఅతిథిగా జరిగిన వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ –2022 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 35 మందికి (౩౦ సంస్థలకు) గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, సీఎం జగన్ కలిసి అవార్డులు ప్రధానం చేశారు. వ్యవసాయం, కళలు మరియు సంస్కృతి, సాహిత్యం, మహిళా శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమలు వంటి రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్ధలకు 20 వైఎస్సార్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు, 10 వైఎస్సార్‌ అచీవ్‌ మెంట్‌ అవార్డులు అందజేశారు.

CM Jagan Target Tekkali : టార్గెట్ టెక్కలి.. అచ్చెన్నాయుడు నియోజకవర్గంపై సీఎం జగన్ సమీక్ష, కచ్చితంగా గెలవాలని ఆదేశం

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కాడాలేని విధంగా తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలకు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ అవార్డులతో మన సంస్కృతి, సంప్రదాయాలకు దశాబ్దాలుగా వారధులుగాఉన్న వారిని గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళల రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారధులను ఈ అవార్డుల్లో ప్రత్యేకంగా చేర్చినట్లు వివరించారు. ఈ అవార్డులు వెనుకబాటుతనం, అణిచివేత, పెత్తందారీ పోకడలపై దండయాత్ర చేస్తున్న సామాజిక ఉద్యమకారులు, పాత్రికేయుల, భిన్నమైన కళాలకు, గళాలకు మరింత దన్నుగా నిలుస్తాయని సీఎం జగన్ పేర్కొన్నారు. సమాజ సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికి ఈ అవార్డులు ప్రతీకగా నిలుస్తాయన్నారు. రాష్ర్ట అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుపై ఈ అవార్డులు ఇవ్వడం ద్వారా ఆ మహానేతను మరోసారి గుర్తు చేసుకున్నట్లేనని జగన్ అన్నారు.

CM Jagan-RGV meet : సీఎం జగన్‌తో రాంగోపాల్ వర్మ భేటీ .. కారణం అదేనా..?!

గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ మాట్లాడుతూ.. అంధ్రప్రదేశ్ రాష్ర్ట అభివృద్ధికి దివంగత నేత వైఎస్సార్ విశేష కృషి చేశారని, వైఎస్సార్‌ తన మార్క్‌ పాలనతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారని కొనియాడారు. అలాంటి మహానేత పేరుతో అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. ప్రజల సమస్యలను పాదయాత్ర ద్వారా తెలుసుకుని దేశ చరిత్రలోనే వైఎస్సార్ అరుదైన నాయకుడిగా నిలిచారన్నారు. సీఎం అవ్వగానే సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మేలు చేశారన్నారు. ఉచిత విద్యుత్, ఆరోగ్య శ్రీ, 108, పావలా వడ్డీ, పేదలకు గృహ నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి పథకాలతో పేదల గుండెల్లో నిలిచారని గవర్నర్ కొనియాడారు.