Jagan Anna Vidya Kanuka : జగనన్న విద్యా కానుక.. అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూస్

విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సమీక్ష జరిపారు.

Jagan Anna Vidya Kanuka : జగనన్న విద్యా కానుక.. అదనంగా స్పోర్ట్స్ దుస్తులు, షూస్

Jagan Anna Vidya Kanuka

Jagan Anna Vidya Kanuka : విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యా విధానంపై సమీక్ష జరిపారు. నూతన విద్యావిధానం అమలు కోసం కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. దీని కోసం అయ్యే ఖర్చుతో వివరాలు తయారు చేయాలన్నారు. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు జరుగుతుందన్నారు.

నూతన విద్యా విధానంతో ఇప్పటి వారికే కాదు, తర్వాత తరాలకూ విశేష ప్రయోజనం కలుగుతుందని సీఎం జగన్ అన్నారు. ఉపాధ్యాయులు, ఇతర భాగస్వాముల్లో అవగాహన, చైతన్యం కలిగించాలన్నారు. నూతన విద్యావిధానం వల్ల జరిగే మేలును వారికి వివరించాలని సీఎం జగన్ చెప్పారు. మండలానికి ఒకటి లేదా రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆట స్థలం లేని స్కూళ్లకు నాడు–నేడు కింద భూమి కొనుగోలు చేయాలన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి విద్యా కానుకలో అదనంగా స్పోర్ట్స్‌ దుస్తులు, షూ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం జగన్ చెప్పారు.