CM Jagan Warning : తేడా వస్తే చర్యలు తప్పవు, మంత్రులకు సీఎం జగన్ సీరియస్ వార్నింగ్
సీఎం జగన్ అధ్యక్షతన ఇవాల కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.

CM Jagan Warning : సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీ తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక అంశాలపై వారితో చర్చించారు. అదే సమయంలో మంత్రులకు వార్నింగ్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను మంత్రులకు అప్పగించారు జగన్. ఏడు స్థానాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు వైసీపీ గెలవాలని మంత్రులకు సూచించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు బాధ్యత మంత్రులదే అని సీఎం జగన్ తేల్చి చెప్పారు. పనితీరు బాగోలేకపోతే మంత్రివర్గంలో మార్పులు తప్పవని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించారు.
Also Read..CM Jagan : రాజధానిపై సీఎం జగన్ క్లారిటీ.. జూలై నుంచి విశాఖ నుంచే పాలన
తేడా వస్తే చర్యలు తప్పవు, పని తీరు బాగోలేకపోతే మంత్రివర్గంలో మార్పులు తప్పవు అంటూ.. ముఖ్యమంత్రి జగన్ చేసిన హెచ్చరిక వైసీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికలను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమవుతోంది.
అసెంబ్లీ వేదికగా ప్రతిపక్షం విమర్శలను తిప్పికొట్టాలని మంత్రులతో చెప్పారు సీఎం జగన్. ఇక, జూలైలో విశాఖకు వెళ్తున్నామని, వైజాగ్ నుంచి పరిపాలన ఉంటుందని మంత్రులకు చెప్పారు ముఖ్యమంత్రి.
త్వరలోనే వైజాగ్ నుంచి పరిపాలన స్టార్ట్ అవుతుందని, తాను కూడా వైజాగ్ కు షిఫ్ట్ అవుతానని సీఎం జగన్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఏప్రిల్ నుంచి అక్కడ పాలన మొదలవుతుందని అంతా అనుకున్నారు. ఆ విధంగా వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో.. జూలైలో విశాఖకు షిఫ్ట్ అవుతానని సీఎం జగన్ ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు.