CM Jagan Tirumala Tour : రేపు తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 27) తిరుమలకు వెళ్లనున్నారు. రేపటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

CM Jagan Tirumala Tour : రేపు తిరుమలకు సీఎం జగన్.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

CM Jagan Tirumala Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (సెప్టెంబర్ 27) తిరుమలకు వెళ్లనున్నారు. రేపటి నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. రేపు (సెప్టెంబర్ 27) మధ్యాహ్నం 3.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తిరుపతి బయల్దేరతారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తొలుత అలిపిరి వద్ద తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సీఎం జగన్ తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకోనున్నారు.

అనంతరం రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయస్వామి దర్శనం చేసుకుంటారు. తర్వాత ఉరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని.. రాత్రి 8.20 గంటలకు స్వామివారికి ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. స్వామివారి దర్శనం అనంతరం సీఎం జగన్.. పెద్ద శేషవాహన సేవలో పాల్గొననున్నారు. వెంకన్న దర్శనం అనంతరం సీఎం జగన్ రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు.

మరుసటి రోజు ఉదయం మరోసారి స్వామివారి దర్శనం చేసుకుని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తిరుమల కొండపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఆపై, రేణిగుంట చేరుకుని నంద్యాల జిల్లా పర్యటనకు వెళతారు.

నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలోని రామ్‌కో సిమెంట్ ప్యాక్టరీ ప్రాంగణంలో జరిగే కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలో నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.