CM YS Jagan: ఓటర్లకు జగన్ థ్యాంక్స్.. ప్రజలు వైసీపీకి 100కు 97 మార్కులేశారంటూ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనకు.. ప్రజలు 100కు 97 మార్కులు వేశారని ట్వీట్ చేశారు.

CM YS Jagan: ఓటర్లకు జగన్ థ్యాంక్స్.. ప్రజలు వైసీపీకి 100కు 97 మార్కులేశారంటూ ట్వీట్

Cm Jagan

CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ పరిపాలనకు.. ప్రజలు 100కు 97 మార్కులు వేశారని ట్వీట్ చేశారు. తమ ప్రభుత్వానికి పల్లెలే కాదు.. పట్టణాలు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచాయని అన్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ధన్యవాదాలు అంటూ.. ట్వీట్ లో కామెంట్ చేశారు.

ఈ ఎన్నికల్లో.. కీలకమైన చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని వైసీపీ దక్కించుకుంది. ఆ పార్టీ మొదటి నుంచీ చెబుతున్నట్టుగా.. చంద్రబాబు కోటలో తామే పాగా వేస్తామని అన్నట్టుగా.. ప్రజలు తీర్పు చెప్పారు. టీడీపీ కంచుకోటలో వైసీపీని గెలిపించారు. అలాగే.. నెల్లూరు కార్పొరేషన్ లో అయితే.. వైసీపీ ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. అక్కడ ఏకగ్రీవాలతో కలిపి.. 54 డివిజన్లలో అందరూ వైసీపీ అభ్యర్థులే గెలిచారు. టీడీపీకి ప్రాతినిధ్యమే లేకుండా ప్రజలు తీర్పు చెప్పారు.

ఇక.. కుప్పంలో చూస్తే.. అక్కడ ఉన్న 25 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు.. ఏకంగా 19 స్థానాలను దక్కించుకున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన ఈ ప్రాంతంలో.. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. ప్రతిపక్ష టీడీపీని.. కేవలం 6 వార్డులకు మాత్రమే పరిమితం చేశారు.

ఈ ఫలితాలపై.. వైసీపీ నేతలు ఫుల్ జోష్ తో ఉన్నారు. కుప్పంలో విజయాన్ని ఆ పార్టీ శ్రేణులు బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ సాధించిన విజయాలు.. ఏపీ అధికార పార్టీలో ఉత్సాహాన్ని మరింత పెంచాయి. ముఖ్యమంత్రి జగన్ సైతం ఉత్సాహంగా ట్వీట్ చేశారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనెలే ఇంతటి విజయాన్ని అందించాయన్నారు.

Read More:

AP Municipal Results 2021 : మున్సిపాలిటీల్లో ఫ్యాన్ జోరు.. కుప్పంలో బాబు బేజారు- Live Updates

YSRCP : వార్ వన్‌సైడ్.. నెల్లూరులో వైసీపీ క్లీన్‌స్వీప్.. 54 డివిజన్లలోనూ ఫ్యాన్ గాలి