CM Jagan : కరోనా పూర్తిగా తగ్గిపోతుందని అనుకోవద్దు..దేనికైనా రెడీగా ఉండాలి

CM జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కోవిడ్ జీరోస్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దని..ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఏపీలో మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని అలాగే పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని వెల్లడించారు. కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇవ్వటంతో దాన్ని పొడిగిస్తున్నామని..జూన్ 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని..20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని..గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగించాలని కలెక్టర్లుకు సూచించారు.

CM Jagan : కరోనా పూర్తిగా తగ్గిపోతుందని అనుకోవద్దు..దేనికైనా రెడీగా ఉండాలి

Ap Cm Jagan Video Conference Collectors Suggestions On The Subject Of The Corona

CM Jagan video conference collectors : CM జగన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..కోవిడ్ జీరోస్థాయికి చేరుతుందని ఎప్పటికీ అనుకోవద్దని..ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఏపీలో మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు. ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని అలాగే పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని వెల్లడించారు. కర్ఫ్యూ మంచి ఫలితాలను ఇవ్వటంతో దాన్ని పొడిగిస్తున్నామని..జూన్ 20 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని..20 తర్వాత కూడా కొన్ని సడలింపులతో కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని..గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగించాలని కలెక్టర్లుకు సూచించారు.

కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలని ఖరాఖండీగా చెప్పారు. మాస్కులు, శానిటైజర్లు వంటివాటిని పాటించి తీరాలన్నారు.ఇవి మన జీవితంలో భాగం కావాలన్నారు. కోవిడ్‌ లక్షణాలతో ఎవరు బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు. ఫీవర్‌ సర్వే కార్యక్రమం ప్రతి వారం కొనసాగాలని ఆదేశించారు. పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారంపడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారని అందుకు కలెక్టర్లను అభినందిస్తున్నానని అన్నారు. కరోనా వైద్యం పేరుతో దోచుకునే ప్రయివేటు ఆస్పత్రులపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. రోగులకు కరోనా చికిత్స భారం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని అన్నారు.

కరోనా వైద్యం కోసం ప్రభుత్వం ప్రకటించిన రేట్లుకన్నా.. ఎక్కువ ఛార్జి చేయకూడదు. ఎవరైనా వసూలు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అటువంటి ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకునే విషయంలోను..అవసరమైతే అటువంటి ఆస్పత్రులను మూసివేయడానికి కూడా కలెక్టర్లు సంకోచించవద్దని ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను ప్రైవేటు ఆసుపత్రులు మొదటిసారి ఉల్లంఘిస్తే పెనాల్టీలు..రెండోసారి చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ లను చూశాం. కానీ థర్డ్‌వేవ్‌ వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.కానీ అది వస్తుందో లేదో తెలియదు. కానీ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవటానికి మనం ప్రిపేర్‌గా ఉండాలని అన్నారు. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. పక్కా ప్లాన్ తో ఉండాలి. పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.