CM Jagan : నేడు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటన..వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత సహాయం విడుదల

ఏపీ సీఎం జగన్ ఇవాళ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉడయం 10.30 గంటలకు గొల్లప్రోలుకు చేరుకుంటారు. 10.45 నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు గొల్లప్రోలు నుంచి తిరుగు పయనమవుతారు.

CM Jagan : నేడు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటన..వైఎస్సార్‌ కాపు నేస్తం మూడో విడత సహాయం విడుదల

Jagan

AP CM Jagan : ఏపీ సీఎం జగన్ ఇవాళ కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం విడుదల చేయనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం జగన్.. ఉడయం 10.30 గంటలకు గొల్లప్రోలుకు చేరుకుంటారు. 10.45 నుంచి 12.15 గంటల వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తర్వాత వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు. మధ్యాహ్నం 12.40 గంటకు గొల్లప్రోలు నుంచి తిరుగు పయనమవుతారు.

ఈ పథకం ద్వారా 3 లక్షల 38 వేల 792 మంది మహిళలకు ఆర్థికసాయం అందనుంది. కాపు సామామజిక వర్గంలోని ఉపకులాలకు చెందిన బలిజ, ఒంటరి, తెలగ వర్గాల మహిళలకు ఈ లబ్ధి చేకూరనుంది. 45 ఏళ్ళు నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా 15 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది. ఆ నగదును సర్కార్ నేరుగా మహిళల ఖాతాలో జమ చేస్తుంది.

CM Jagan On Meters : కరెంటు బిల్లు అంతా ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పండి- సీఎం జగన్ కీలక ఆదేశాలు

ఈ పథకం కోసం ప్రభుత్వం ఏటా సుమారు 490 కోట్ల రూపాయలను వెచ్చించి..కాపు మహిళలకు ప్రోత్సహిస్తోంది. ఈ పథకం ద్వారా వైసీపీ ఐదేళ్ల పాలనలో 75 వేల రూపాయలు.. అంటే ఏడాదికి 15 వేల చొప్పున ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ పథకంలో లబ్ధిదారుల మహిళలు నెలసరి ఆదాయంలో గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10 వేలు, పట్టణ ప్రాంతంలో 12 వేలలోపు ఉన్న వారు అర్హులు.