AP CM Jagan: రెండు రోజులు బిజీబిజీగా సీఎం జగన్.. గవర్నర్‌తో భేటీ, రెండు జిల్లాల్లో పర్యటన.. షెడ్యూల్ ఇలా..

విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులో సీఎం జగన్ పాల్గోనున్నారు.

AP CM Jagan: రెండు రోజులు బిజీబిజీగా సీఎం జగన్.. గవర్నర్‌తో భేటీ, రెండు జిల్లాల్లో పర్యటన.. షెడ్యూల్ ఇలా..

Ap CM Jagan

AP CM Jagan: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (ap cm jaganmohan reddy) రెండు రోజులు వరుస పర్యటనలతో బిజీబిజీగా గడపనున్నారు. సోమవారం ప్రకాశం జిల్లా (Prakasam District)లో పర్యటించనున్న జగన్, సాయంత్రం రాజ్‌భవన్‌ (Raj Bhavan) లో గవర్నర్‌తో మర్యాదపూర్వక భేటీ కానున్నారు. సోమవారం ఉదయం 10గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం (Jagan Tadepalli residence) నుంచి బయలుదేరుతారు. 11గంటలకు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకుంటారు. 11.15గంటలకు కొండెపి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ ఛార్జి వరికూటి అశోక్ బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

CM Jagan : ఉగాది వేడుకల్లో సీఎం వైఎస్‌ జగన్‌..

సోమవారం సాయంత్రం ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో జగన్ మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు. మరుసటిరోజు 28వ తేదీన సాయంత్రం 5.15 గంటలకు జగన్ విశాఖపట్టణంకు చేరుకుంటారు. సాయంత్రం 6గంటలకు రిషికొండ రాడిసన్ బ్లూ రిసార్ట్స్‌కు వెళ్తారు. అక్కడ రాత్రి 7-8 గంటల మధ్య జీ-20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గోనున్నారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గాలా డిన్నర్ లో జగన్ పాల్గోనున్నారు. అనంతరం రాత్రి 8.45 గంటల సమయంలో విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.

CM Jagan: బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చూతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం

విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో 28, 29 తేదీల్లో జీ-20 సదస్సు జరగనుంది. ఇందుకు సంబంధించి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జీ-20 సదస్సు నేపథ్యంలో విశాఖ సుందరీకరణకు 100 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఆర్కే బీచ్ నుంచి రాడిసన్ బ్లూ హోటల్ వరకు ఉన్న మార్గాన్ని అత్యంత అందంగా తయారు  చేశారు. సదస్సుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తిచేయగా, మంత్రులు ఆదిమూలపు సురేష్, విడుదల రజనీ, అమర్నాథ్, సంబంధిత అధికారులు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.