CM Jagan : చంద్రబాబుకి బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం జగన్.. నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ట్వీట్

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నేడు(ఏప్రిల్ 20,2021) 72వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. "చంద్రబాబునాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో మీరు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు.

CM Jagan : చంద్రబాబుకి బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం జగన్.. నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని ట్వీట్

Ap Cm Jagan Wishes Chandrababu

CM Jagan : మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నేడు(ఏప్రిల్ 20,2021) 72వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ లో బర్త్ డే విషెస్ చెప్పారు. “చంద్రబాబునాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుని ఆశీస్సులతో మీరు నిండు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు.

కాగా, కరోనా వేగంగా విస్తరిస్తున్న సమయంలో తన పుట్టిన రోజు వేడుకలు ఎవరూ చేయొద్దని స్వయంగా చంద్రబాబే అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండడమే తనకు ముఖ్యమన్నారు. కరోనాకు అంతా దూరంగా ఉండాలి అని ఆయన కోరారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, చంద్రబాబు ఫ్యాన్స్ వరుస పోస్టులు పెడుతున్నారు. దీంతో #HBDCBN అనే హ్యాష్ ట్యాగ్ మోత మోగుతోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేతలే ఎక్కవగా పోస్టులు పెడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మెగాస్టార్ చిరంజీవి సైతం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. హార్డ్ వర్క్, క్రమశిక్షణకు మారు పేరు అయిన చంద్రబాబుకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి.

నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు …టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా తెలుగు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అటు దేశ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలకంగా వ్యవహరించారు. 1950 ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో సాధారణ రైతు కుటుంబంలో చంద్రబాబు జన్మించారు. తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1978లో చంద్రగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తన 28వ ఏళ్ల వయసులోనే మంత్రిగా పనిచేశారు. టంగుటూరి అంజయ్య మంత్రిమండలిలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని పెళ్లాడారు. అయితే ఎన్టీఆర్ 1982లో టీడీపీని స్థాపించినప్పటికి చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు. ఇక 1983 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందగా… ఆ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు అనంతరం టీడీపీలో చేరారు.

1989 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుపొంది శాసన సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎన్టీఆర్ నేతృత్వంలో 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది. అయితే ఆ ఏడాది తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు సీఎం పగ్గాలను చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు ఆయన ఏపీ సీఎంగా వ్యవహరించడంతో పాటు 2004, 2009 పదేళ్లు ప్రతిపక్షనేతగా వ్యవహరించారు. తెలంగాణ విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. దీంతో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అనూహ్య ఓటమిని చనిచూసింది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు ఏపీ ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.