YS Jaganmohan Reddy: రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనకు శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు.

YS Jaganmohan Reddy: రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ..

YS Jaganmohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం నుంచి విమానంలో ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రికి వన్ జన్‌పథ్‌లో బస చేస్తారు. 7వ తేదీ (ఆదివారం) ఉదయం 9.30గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకుంటారు. ఆ తర్వాత నుంచి సాయంత్రం 4.30గంటల వరకు అక్కడ జరిగే నీతి అయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఏడవ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

CM YS Jagan : 175 స్థానాలే వైసీపీ టార్గెట్, వారికి జగన్ కీలక బాధ్యతలు

సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లేముందు శనివారం శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస జూనియర్ కాలేజీ మైదానంలో జరగనున్న శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇదిలాఉంటే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ ఏడో గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఉంటుంది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య సహకారానికి ఈ సమావేశం మరింత తోడ్పడుతుందని పీఎం కార్యాలయం పేర్కొంది. 2019 జూలై తర్వాత నీతి ఆయోగ్ సభ్యులు అన్ని రాష్ట్రాల సీఎంలు ప్రత్యక్షంగా పాల్గొంటున్న ఈ సమావేశం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా జరగనుంది.

CM YS JAGAN: ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సూచన

ఈ నీతి ఆయోగ్ సమావేశంలో పంటల వైవిధ్య, పప్పులు, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, అగ్రి కమ్యూనిటీస్, ఎన్ఈపీ అమలు, పట్టణ పాలన వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు ఉంటాయని పీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.