covid vaccine : రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు పంపాలని ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ

కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నందున.. దాన్ని అరికట్టేందుకు రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు పంపాలంటూ సీఎం జగన్‌.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల డోసులు పంపాలని లేఖలో కోరారు.

covid vaccine : రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు పంపాలని ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ

Jagan Letter Modi

AP CM Jagan’s letter to Prime Minister Modi : కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నందున.. దాన్ని అరికట్టేందుకు రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్లు పంపాలంటూ సీఎం జగన్‌.. ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి మరో 60 లక్షల డోసులు పంపాలని లేఖలో కోరారు. అడిగిన వెంటనే 6 లక్షల డోసులు పంపించినందుకు మోడీకి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్కరోజులోనే 6లక్షల 28వేల 961మందికి వ్యాక్సిన్‌ అందించినట్లు వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించకుండానే కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అందరికీ కొవిడ్‌ టెస్టులు అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించారు. లక్షణాలు ఉన్న అందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయాలని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో అర్బన్‌ ప్రాంతాల్లో 62శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 38 శాతం కొవిడ్‌ కేసులు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా మరణాలు నమోదవుతున్నట్టు వెల్లడించారు. ఆలస్యంగా ఆసుపత్రులను ఆశ్రయించడమే మరణాలకు కారణంగా గుర్తించారు.

వాలంటీర్‌, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలతో ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఇంటింటి సర్వే చేయడంపై కసరత్తు చేయాలన్నారు. సీసీటీవీల ద్వారా ఆసుపత్రుల పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాణ్యమైన భోజనం, శానిటైజేషన్‌పై దృష్టి సారించాలన్నారు.