CM Jagan : 13న సీఎం జగన్ కీలక సమావేశం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ మీటింగ్ లో చర్చ జరగనుంది. దీంతో పాటు గృహ సారథులను నియమించనున్నారు జగన్.

CM Jagan : 13న సీఎం జగన్ కీలక సమావేశం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ

CM Jagan : సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ మీటింగ్ లో చర్చ జరగనుంది. దీంతో పాటు గృహ సారథులను నియమించనున్నారు జగన్.

పార్టీ సాధించిన విజయాలను ఇంటింటికీ చేర్చటమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయ లేదా అన్నది గృహసారథులు పర్యవేక్షిస్తారు. పార్టీ కేడర్ దెబ్బతినకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు పలు సూచనలు చేయనున్నారు జగన్. సెకండ్ కేడర్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.

Also Read..Jagan Sticker : ఇంటింటికీ జగన్ స్టికర్.. వైసీపీ ప్రభుత్వం మరో సరికొత్త, కీలక కార్యక్రమం

ఎమ్మెల్యేలు, పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. గృహసారథుల కార్యాచరణ ఏంటి, వారితో ఏం చేయబోతున్నా, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది అనే దానిపై ఈ సమావేశంలో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే గృహసారథుల ఎంపిక పూర్తైంది. దాదాపు 5లక్షలకు పైగా గృహసారథులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతీ 50ఇళ్లకు ఇద్దరు గృహసారథులు ఉండే విధంగా ఒక వ్యవస్థను సీఎం జగన్ తీసుకొచ్చారు. ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా గృహసారథులకు శిక్షణా తరగతులు కూడా నడుస్తున్నాయి.

Also Read..Lokesh RTC Driver : లోకేశ్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన బస్సు డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు..! ఆర్టీసీ క్లారిటీ

ఇక ఈ నెల 11 నుంచి గృహసారథులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు ప్రతి ఇంటికీ వెళ్లబోతున్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్ అనే ట్యాగ్ తో ఉన్న స్టిక్కర్లను అతికించనున్నారు. ఇంటి యజమాని అనుమతితోనే ఈ స్టిక్కర్లను అతికించనున్నారు. ఈ నేపథ్యంలోనే గృహసారథులు ఎలాంటి కార్యచరణతో ముందుకెళ్లాలి అనే దానిపై సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న జగన్.. సంక్షేమ పథకాలను ప్రజలకు ముఖ్యంగా లబ్దిదారులకు వివరించే విధంగా గృహసారథులకు సూచనలు చేయనున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.