Andhra Pradesh : నిరుద్యోగులకు శుభవార్త-జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్

ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పబోతున్నారు. ఈరోజు ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,143  ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిధ్దమవుతోంది.

Andhra Pradesh : నిరుద్యోగులకు శుభవార్త-జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్న సీఎం జగన్

Ap Cm Ys Jagan Mohan Reddy To Relase Job Calendar Today

Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పబోతున్నారు. ఈరోజు ఆయన జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,143  ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిధ్దమవుతోంది. ఇప్పటికే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న వివరాలను అధికారులు సిధ్దం చేశారు. ఈ ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. వివిధ శాఖల్లో అవసరాల మేరకు ప్రభుత్వం ఉద్యోగులను భర్తీ చేయనున్నది.

ఆర్ధికశాఖ ఆమోదంతో విడతల వారీగా పరీక్షలు నిర్వహించి ఏపీపీఎస్సీ ఈ ప్రక్రియ చేపడుతుంది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఓ క్రమ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రూపోందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్ ముందుకు దూసుకు వెళుతున్నారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.

విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్‌ ప్రాతిపదికన ఏపీపీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే 2019, జూన్‌ నుంచి జరిగిన ఉద్యోగ నియామకాలు చూస్తే.. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు అందరూ కలిపి మొత్తం 6,03,756 మందిని నియమించారు. ఈరోజు విడుదల చేసే జాబ్ క్యాలెండర్ లో మొత్తం ఉద్యోగాలు 10,143 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

జాబ్ క్యాలెండర్‌లో వచ్చే నెల నుంచి భర్తీ చేసే ఉద్యోగాల వివరాలు
జూలై–2021 ఎస్సీ ఎస్టీ డీఏ బ్యాక్‌లాగ్‌ :…………….. 1,238
ఆగస్టు–2021 ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1, గ్రూప్‌ 2…………      36
సెప్టెంబరు–2021 పోలీస్‌ శాఖ ఉద్యోగులు……………   450
అక్టోబరు–2021 వైద్యులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు……..    451
నవంబరు–2021 పారామెడికల్‌ సిబ్బంది ………….  5,251
డిసెంబరు–2021 నర్సులు………………………….       441
జనవరి–2022 డిగ్రీ కాలేజీల లెక్చరర్లు……………       240
ఫిబ్రవరి–2022 వర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు……    2,000
మార్చి–2022 ఇతర శాఖలు……………………..            36
_______________________________________
భర్తీ చేయనున్న మొత్తం ఉద్యోగాలు :                      10,143
_______________________________________